Bigg Boss Telugu 8 Promo: బిగ్ బాస్ సీజన్ 8 డే బై డే ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ”సీజన్ 8… ఇక్కడ అన్నీ లిమిట్ లెస్” అనే ట్యాగ్ తో మొదలైన ఈ సీజన్ లో రోజుకో ట్విస్టు ఇస్తున్నాడు బిగ్ బాస్. అలానే తాజాగా విడుదలైన వీకెండ్ ప్రోమోలో కంటెస్టెంట్స్ కు ఊహించని షాకిచ్చాడు. ప్రతీ సీజన్ లో విజేతకు ముందుగానే ప్రైజ్ మనీ ఫిక్స్ చేయడం కామన్. కానీ సీజన్ 8లో మాత్రం ‘నో ప్రైజ్ మనీ’ అంటూ పెద్ద ట్విస్టు ఇచ్చాడు.
ఆట ఆధారంగానే ప్రైజ్ మనీ
ప్రైజ్ మనీ లేదంటే మొత్తానికే లేదని కాదు. ప్రతీ వారం కంటెస్టెంట్స్ ఆట ఆధారంగానే ప్రైజ్ మనీ పెరుగుతూ ఉంటుంది. ఫిక్స్డ్ అమౌంట్ కాకుండా వారం వారం హౌస్ మేట్స్ ఆట తీరును బట్టే ప్రైజ్ మనీ డిసైడ్ అవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని నాగార్జున తాజాగా విడుదలైన వీకెండ్ ప్రోమోలో తెలియజేశారు. ఈ కాన్సెప్ట్ ఏదో బిగ్ బాస్ కు బాగానే వర్కౌట్ అయ్యేలా ఉందని జనాలు అనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల కంటెస్టెంట్ ఎక్కడా రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఉండదు. దీంతో వాళ్ళ మధ్య కాంపిటీషన్ పెరిగి షో మరింత ఆసక్తికరంగా మారే ఛాన్స్ ఉంది. అందుకే బిగ్ బాస్ ఈ ”నో ప్రైజ్ మనీ” కాన్సెప్ట్ క్రియేట్ చేసినట్లుగా చర్చించుకుంటున్నారు.
Also Read: Bigg Boss Telugu 8: బేబక్క, శేఖర్ భాష ఎలిమినేటెడ్..? బిగ్ బాస్ ట్విస్ట్..! – Rtvlive.com