పృథ్వీకి నాగార్జున బంఫర్ ఆఫర్.. 5 లక్షలతో పాటూ 3 వారాలు నో నామినేషన్ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో నాగార్జున.. పృథ్వికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. గడ్డం తీసేస్తే, రూ.5 లక్షలు లేదా మూడు వారాలు నామినేషన్స్‌లో లేకుండా ఉండేలా ఇమ్యూనిటీ ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. By Anil Kumar 19 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి బిగ్ బాస్ లో నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్ కోసం ఇటు హౌస్ మేట్స్ తో పాటూ అటు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు కంటెస్టెంట్స్ ఆట తీరు ఎలా ఉంది? ఎవరు బాగా ఆడారు? ఎవరు ఆడలేదు? ఇలా వీకండ్ ఎపిసోడ్ లో చాలానే ఉంటాయి. ఈ వారం ఆ తరుణం రానే వచ్చింది. ఈ వీకెండ్ ఎపిసోడ్ కు సంబంధించి స్టార్ మా తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది. Also Read : వెంకటేష్, నితిన్ కాంబోలో సినిమా.. హీరోయిన్ గా కీర్తి సురేష్ డబుల్ ఆఫర్.. ఇందులో గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన పరిణామాలపై నాగార్జున మాట్లాడారు. టాస్క్‌లో భాగంగా హెయిర్ కట్ చేయించుకున్న అవినాష్‌ను మెచ్చుకున్నారు. వెనకడుగు వేసిన పృథ్వీకి మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చారు. గడ్డం తీసేస్తే, రూ.5 లక్షలు లేదా మూడు వారాలు నామినేషన్స్‌లో లేకుండా ఉండేలా ఇమ్యూనిటీ ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. మరి ఆ ఆఫర్‌కు పృథ్వీ ఓకే చెప్పాడా? లేదా? ఈ రోజు ఫుల్ ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సిందే. Also Read : సమంతకు యాటిట్యూడ్ ఎక్కువ.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్ ఇదిలా ఉంటే టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ అవినాష్, పృథ్వీలకు ఓ ఛాలెంజ్ ఇచ్చారు. ఆ ఛాలెంజ్ లో ఇద్దరూ తమ హెయిర్ కట్ చేసుకోవాలని స్క్రీన్ పై మూడు రకాల హెయిర్ కట్స్ చూపించారు. వాటికీ 25,000 నుంచి లక్ష రూపాయల ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు. Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల సినిమాకు ఊరమాస్ టైటిల్ అయితే ఈ టాస్క్ కు పృథ్వీ నో చెప్పగా.. అవినాష్ మాత్రం హెయిర్ కట్ చేయించుకున్నాడు. టాస్క్ లో పృథ్వీ హెయిర్ కట్ చేసుకోకపోవడంతో వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున.. పృథ్వీని కూడా హెయిర్ కట్ చేయించుకోమని అన్నారు. కనీసం షేవింగ్ చేసుకుంటే 5 లక్షల ప్రైజ్ మనీ ఇస్తానని, దాంతో పాటూ మూడు వారాలు నో ఎలిమినేషన్ అని ఆఫర్ ఇచ్చారు. Also Read : మరో టాలీవుడ్ ఆఫర్ అందుకున్న 'ఉప్పెన' బ్యూటీ.. ఈసారి మాస్ హీరోతో #bigg-boss-telugu-8-promo #nagarjuna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి