Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రకృతి విపత్తు కారణంగా తనకు తెలియకుండానే తన ప్రాణాలను కోల్పోయాడు ఓ వ్యక్తి. భద్రాచలం పట్టణం తాతగుడి సెంటర్ కు చెందిన వెంకన్న తాను నివసిస్తున్న ఇల్లు నేలమట్టమవడంతో (House Collapse) అక్కడిక్కడే మరణించాడు. వర్షానికి (Rain) ఇంటి గోడలు బాగా నానిపోవడంతో ఇల్లు కుప్పకూలిపోయింది. అదే సమయంలో ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న వెంకన్న పై ఇల్లు కూలడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న భద్రాచలం (Bhadrachalam) పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read: Filmfare Awards South 2024: బలగం, దసరా సినిమాలకు అవార్డుల పంట.. ఉత్తమ దర్శకుడిగా వేణు – Rtvlive.com