AP News: నేటికాలంలో మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య రోజూరోజుకు పెరిగిపోతున్నాయి. వారసుడు కావాలంటూ కొందరు, అదనపు కట్నం కోసం మరికొందరు కిరాతకులు తమ భార్యల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో ఓ గర్భిణి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. వివరాల్లో వెళ్తే.. పాలకొల్లు మండలం భగ్గేశ్వరానికి చెందిన జనార్దన్, దేవి ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. అయితే.. కొన్ని రోజులుగా అత్తామామలు, భర్త తమ బిడ్డ దేవిని అదనపు కట్నం కోసం వేదిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగలోకి దిగిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
AP News
AP News: ముగ్గురిని కాపాడిన సూపర్ హీరో… తాను మాత్రం..!!
AP News: బుడమేరు వరదనీరు ఏపీ ప్రజలను ఎంతగా అతలాకుతలం చేసిందో మనందరికీ తెలుసు. ఈ ప్రమాదంలో చాలామంది ఇల్లు మునిగిపోగా.. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి ఘటన మరొకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింగ్‌నగర్‌లో వరదల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడేందుకు ఓ యువకుడు సాహసం చేశాడు. తన డెయిరీ ఫాంలో చిక్కుకున్న అన్నతో పాటు మరో ఇద్దరు వర్కర్లను కాపాడేందుకు చంద్రశేఖర్ అనే యువకుడు వెళ్లాడు. అయితే వీళ్లన్ని కాపాడి ఒడ్డుకు చేర్చిన తర్వాత అదే నీటిలో చంద్రశేఖర్ అనే యువకుడు నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. చంద్రశేఖరకు 15 నెలల క్రితమే వివాహం జరిగింది. నలుగురిని కాపాడి తన ప్రాణాలను విడిచిన చంద్రశేఖర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెళ్ళు వెత్తుతున్నాయి. చంద్రశేఖర్ సూపర్ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు.
AP News: కొల్లేరు ఉగ్రరూపం.. ముప్పులో లంక గ్రామాలు
AP News: ఏలూరు జిల్లాలో కొల్లేరు ఉగ్రరూపం దాల్చింది. బుడమేరు నుంచి వరద నీరు కొల్లేరుకు ఎక్కువగా చేరడంతో కింద ఉన్న లంక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందు పడుతున్నారు. బుడమేరు వరద, ఎడతెరపిలేని వర్షాలతో కొల్లేరు ఉధృత ప్రవాహం వచ్చి చేరుతుంది. కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లంక గ్రామాలు ముంపులో ఉన్నాయి. కైకలూరు, ఏలూరు, మండవల్లి మండలాలకు వరద ప్రభావం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. పెద్ద ఎడ్లగాడి వంతెన వద్ద 3.41 మీటర్లకు నీటిమట్టం చేరింది. ఏలూరు, కైకలూరు, కొల్లేరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయ్యాయి. చేపలు, రొయ్యల చెరువులపైనుంచి వరద వెళ్లడంతో ఆక్వా రైతులు విలవిలలాడుతున్నారు.
AP News: మరొకరిని మింగిన బుడమేరు.. వినాయకచవితి నాడు గల్లంతై..
AP News: విజయవాడలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరదలు వచ్చాయి. వరదల ఉధృతికి బుడమేరు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఏపీలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు వాగుకు మూడు గండ్లు పడ్డాయి. విజయవాడలో అనేక పరీవాక ప్రాంతాల్లో వరద నీరు వచ్చే ఇళ్లు అన్ని జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో.. వినాయక చవితి పండుగ రోజు (శనివారం) రాత్రి బుడమేరులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆ రోజు బుడమేరులో గల్లంతైన వ్యక్తి డెడ్‌బాడీ లభ్యమయింది. ఈ రోజు మధ్యాహ్నం మృతదేహాన్ని NDRF సిబ్బంది గుర్తించారు. గన్నవరం మండలం కేసరపల్లి దగ్గర కొట్టుకుపోయిన ఫణికృష్ణ.. పడిన ప్రదేశానికి దగ్గరలోనే మృతదేహం ఉంది.
మచిలీపట్నానికి చెందిన ఫణికుమార్ హైదరాబాద్‌లో ఉంటూ.. వినాయక చవితికి స్వగ్రామానికి వచ్చాడు. గన్నవరంలోని బంధువుల ఇంటికి కారులో వెళ్లి తిరిగి వెళ్లాడు. బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుందని.. విజయవాడ మీదుగా వెళ్లాలని బంధువులు సూచించారు. అయినా వినకుండా కేసరపల్లి- ఉప్పులూరు- కంకిపాడు మీదుగా వెళ్తానని ఫణికుమార్ చెప్పారు. అనంతరం ఆయన బయలుదేరిన కొద్దిసేపటికి బుడమేరు ప్రవాహానికి ఆయన కారు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తుండగా.. కొట్టుకుపోయిన ప్రదేశానికి కొద్ది దూరంలో మృతదేహం లభ్యమైంది.
AP: లేడీ కిల్లర్స్.. అప్పు తీసుకుంటారు, అడిగితే చంపేస్తారు..!
Guntur: గుంటూరు జిల్లాలో మహిళా సైనైడ్ కిల్లర్స్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వడ్లమూడిలో నాగూర్ బీని అనే మహిళ జూన్ నెలలో అనుమానాస్పదంగా మృతి చెందగా పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, కేసు విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. ముగ్గురు లేడీ కిలర్స్ అప్పు తీసుకుని, అడిగితే చంపేస్తారని దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి.
Also Read: ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయకండి.. వైసీపీకి పురంధేశ్వరి వార్నింగ్..!
నాగూర్ బీని నుంచి అప్పు తీసుకున్న ముగ్గురు కిలాడీ లేడీలు ఆమె అప్పు అడిగినందుకు బ్రీజర్‌లో సైనెడ్ కలిపి చంపేసినట్లు గుర్తించారు. ఇలా మరో నాలుగు హత్యలు చేసినట్లు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు మునగప్ప రజని, ముడియాల వెంకటేశ్వరి, గొంతు రమణమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: నేను చనిపోతున్నా.. పెళ్లయిన 20 రోజులకే చేతిపై రాసుకొని..!
గతంలో కంబోడియా వెళ్లొచ్చిన ప్రధాన నిందితురాలు వెంకటేశ్వరి అక్కడ పలు నేరాల్లో పాల్గొన్నట్టుగా అధికారులు గుర్తించారు.
నిందితుల్లో మరొకరు వాలంటీర్‌గా పనిచేశారు. ముగ్గురు నిందితులు రెండేళ్లలో 4 హత్యలు, 3 హత్యాయత్నాలు చేశారని అది కూడా ఆ హత్యలను ఒకే స్టైల్లో చేసినట్లు తెలుస్తుంది. ఈ గ్యాంగ్‌కి సైనైడ్ అమ్మిన వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యారు.
AP: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్
Nandigam Suresh Arrested: వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టుకొట్టేసింది.
దీంతో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు బుధవారం ఉద్దండరాయునిపాలెంలోని తుళ్లూరు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే సురేష్ అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. తన సెల్ కూడా స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో పోలీసులు చాలా సేపు అక్కడే ఉండి వెనుదిరిగారు.
సెల్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారంతో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బలగాలు ఆయన్ని అరెస్ట్ చేసి మంగళగిరి తరలిస్తున్నట్లు తెలిపారు.
అయితే నందిగం సురేష్ అరెస్ట్ గురించి పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలంతా కూడా అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు.
Also Read: తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు!