Anil Ravipudi – Venkatesh Movie Update : టాలీవుడ్ లో F2,F3 లాంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రం కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.
ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఐశ్వర్య రాజేష్ తో పాటు మీనాక్షి చౌదరి
ఇందులో వెంకీమామతో రొమాన్స్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్బంగా మీనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్‌ల ఫస్ట్ లుక్‌లను పంచుకుంది.
Team #VenkyAnil3 x #SVC58 warmly welcomes the bundle of talent, @aishu_dil, on board to charm audiences as the EXcellent Wife ❤️
Pooja Ceremony Tomorrow at 11.16 AM 🪔
More EXciting updates loading💥
Victory @VenkyMama @AnilRavipudi #DilRaju #Shirish #BheemsCeciroleo… pic.twitter.com/LNWROs5J2X
— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2024
Also Read : పాన్ ఇండియా డైరెక్టర్ తో మోక్షజ్ఞ మూవీ ఫిక్స్.. నిర్మాతగా బాలయ్య, అనౌన్స్ మెంట్ ఆ రోజే!
ఇందులో ఐశ్వర్య రాజేష్ చీరకట్టులో పెళ్ళైన మహిళగా, మీనాక్షి మాత్రం స్టైలిష్ లుక్స్ లో కనిపించారు. దీన్ని బట్టి ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ వెంకటేశ్ భార్యగా నటించనున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
The charming diva @Meenakshiioffl, joins the clan of #VenkyAnil3 x #SVC58 as the elegant EX-Girl Friend 😘
Pooja ceremony tomorrow at 11.16 AM 🪔
Victory @VenkyMama @AnilRavipudi @aishu_dil #DilRaju #Shirish #BheemsCeciroleo @YoursSKrishna @SVC_official pic.twitter.com/kqmXtO377k
— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2024