/rtv/media/media_files/2024/11/13/2m11yrb51fIrLj9jsfW2.jpg)
ఎఫ్2, ఎఫ్3 వంటి హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి మరోసారి కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ముందే అనౌన్స్ చేశారు. దాన్నే దృష్టిలో పెట్టుకుని రేయింబవళ్లు కష్టపడిన మూవీ టీమ్ అప్పుడే చిత్రీకరణను దాదాపు పూర్తి చేసేసింది.
Also Read : త్వరలో ముగియనున్న ధరణి కథ.. రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదే!
ఇక తాజాగా మూవీ టీమ్ ఓ అదిరిపోయే అప్డేట్ పంచుకుంది. ఈ సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇందుకు సంబంధించి చిన్న వీడియో క్లిప్ వదిలారు. అందులో ఈ సాంగ్ ను ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కం సింగర్ రమణ గోగుల పడినట్లు చూపించారు. అలాగే ప్రముఖ పాటల రచయిత భాస్కర భట్ల ఈ సాంగ్ ను రాశారు.
Also Read : ఫస్టాఫ్ అద్భుతం,సెకండాఫ్ అంతకు మించి.. రష్మిక పోస్ట్ వైరల్
A special song calls for a very special singer to bring the magic to life❤️🔥
— Sri Venkateswara Creations (@SVC_official) November 13, 2024
After 18 Long years, Bringing back the blockbuster vintage combo of Victory @VenkyMama and @RamanaGogula for a chartbuster tune composed by #BheemsCeciroleo 💥
-- https://t.co/HWcxIst1F3… pic.twitter.com/LGW5gGNLUR
Also Read : ఫస్టాఫ్ అద్భుతం,సెకండాఫ్ అంతకు మించి.. రష్మిక పోస్ట్ వైరల్
18 ఏళ్ళ తర్వాత..
భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. సుమారు 18 ఏళ్ళ తర్వాత రమణ గోగుల.. వెంకటేష్ సినిమాకు పాట పడుతుండటం విశేషం.అప్పట్లో వీరి కాంబోలో వచ్చిన ప్రేమంటే ఇదేరా, లక్ష్మీ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అందులోని సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వెంకిమామ కోసం రమణ గోగుల పాట పాడటంతో ఈ సాంగ్ పై అంచనాలు పెరిగిపోయాయి. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
Also Read : మరోసారి హోస్ట్ గా దగ్గుబాటి రానా.. బాలయ్యకు పోటీగా టాక్ షో