'సంక్రాంతికి వస్తున్నాం' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..ఎప్పుడంటే? వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ నేడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ ని ప్రకటించారు. జనవరి 14 సంక్రాంతి రోజున రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. By Anil Kumar 20 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. క్రైం కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. Also Read : పదేళ్లు ఏం వెలగబెట్టారని మమ్మల్ని దిగిపొమ్మంటున్నారు.. బీఆర్‌ఎస్‌కు రేవంత్ చురకలు జనవరి 14 న.. ఎఫ్2, ఎఫ్3 వంటి హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న హ్యాట్రికేక్ ప్రాజెక్ట్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ నేడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ ని ప్రకటించారు. జనవరి 14 సంక్రాంతి రోజున రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. Also read: మనుషులను చంపేస్తున్న మూఢనమ్మకాలు.. పాముకాటు తర్వాత ఇలా చేస్తే అంతే సంగతి! ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో వెంకీమామ పంచె కట్టులో చేతిలో గన్ పట్టుకొని ఉన్న లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. గత ఏడాది సంక్రాంతికి 'సైంధవ్' అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈ సంక్రాంతికైనా వెంకీమామ ఖాతాలో హిట్ పడుతుందేమో చూడాలి. ENTERTAINMENT LOADED 😎FUN READY TO FIRE 🔥The Blockbuster combo of Victory @VenkyMama and Hit Machine Director @AnilRavipudi is all set for a VICTORIOUS HATTRICK this Sankranthi 💥💥💥#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025.… pic.twitter.com/m0isUz0FdA — Sri Venkateswara Creations (@SVC_official) November 20, 2024 Also Read : మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ముగిసిన పోలింగ్..భారీగా నమోదయిన ఓటింగ్ త్వరలోనే ఫస్ట్ సింగిల్.. ఈ సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇందుకు సంబంధించి చిన్న వీడియో క్లిప్ వదిలారు. అందులో ఈ సాంగ్ ను ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కం సింగర్ రమణ గోగుల పడినట్లు చూపించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. సుమారు 18 ఏళ్ళ తర్వాత రమణ గోగుల.. వెంకటేష్ సినిమాకు పాట పడుతుండటం విశేషం. Also Read: రేవంత్ పతనం కొడంగల్ నుంచే స్టార్ట్ చేస్తా: పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో! #sankranthiki-vasthunnam #tollywood #anil-ravipudi-venkatesh-3-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి