Rashmika Mandanna in Gam Gam Ganesha Pre Release: నేషనల్ క్రష్ రష్మిక, రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ కూడా వినిపించింది. కానీ ఈ రూమర్స్ పై ఇప్పటివరకు రష్మిక, విజయ్ ఎక్కడ కూడా స్పందించలేదు.
అయితే తాజాగా ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేష’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక చేసిన కామెంట్స్ మరో సారి ఈ రూమర్స్ కు తెరలేపింది.
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘గం గం గణేష’. మే 31 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మే 27న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నేషనల్ క్రష్ రష్మిక ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆనంద్, రష్మిక మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది.
ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా..
ఒక ఫన్ గేమ్ లో భాగంగా ఆనంద్ దేవరకొండ ఆనంద్ దేవర కొండ మీ ఫేవరేట్ కోస్టార్ (Favorite Co-star) ఎవరని రశ్మికను అడిగాడు. దీంతో రష్మిక.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా. ఇలా స్పాట్ లో పెడితే ఎలా. నా ఫేవరేట్ హీరో రౌడీ భాయ్ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. ఇక ఆనంద్ చిన్న రౌడీ అని చెప్పొచ్చుగా అనేసరికి.. మళ్ళీ నవ్వుతూ ఆనంద్ పేరు చెప్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుత నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
#Anand : who’s your Fav co-star?#RashmikaMandanna – RowdyBoy (vijaydevarakonda) pic.twitter.com/Xv0XpXSe1q
— Filmy Bowl (@FilmyBowl) May 27, 2024
Also Read: Pushpa 2 : సూసేకి అగ్గిరవ్వ మాదిరే.. పుష్ప సాంగ్ లుక్ అదిరింది..! – Rtvlive.com