Kedar Selagamsetty : దుబాయ్లో తెలుగు నిర్మాత కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. యంగ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలగంశెట్టి కన్నుమూశారు.  దుబాయ్ లో ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తోంది.  ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గం గం గణేశా అనే సినిమా ఈయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

New Update
telugu producer

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. యంగ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలగంశెట్టి కన్నుమూశారు.  దుబాయ్ లో ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తోంది.  గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న కేదార్.. ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కొంతకాలం నుంచి దుబాయ్ లో నివాసం ఉంటున్నారు  కేదార్. ఈయనకు భార్య, ఓ కూతురు ఉన్నారు.

Also Read :  ఏపీలో కుల పిచ్చి.. అప్పటి వరకే టీడీపీతో.. పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్

Also Read :  ఎస్ఎల్ బీసీ సందర్శనకు బీఆర్ఎస్ బృందం.. అరెస్ట్ చేయకుండా చూసుకోవలసింది వారే

విజయ్, సుకుమార్‌ కాంబోలో

కాగా ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గం గం గణేశా అనే సినిమా ఈయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అల్లు అర్జున్, బన్నీ వాసు, విజయ్ దేవరకొండలకు ఈయన  అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది. గతంలో ముత్తయ్య అనే సినిమాకి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.

కేదార్ మృతి పట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కేదార్ విజయ్ దేవరకొండ, సుకుమార్‌ కాంబోలో ఓ సినిమాకు ప్లాన్ చేశారు. సుకుమార్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చారాయన. ఇంతలోనే కేదార్ మృతి చెందడం టాలీవుడ్ ను శోకసంద్రంలోకి నెట్టింది.   

Also Read :  అద్దంకికి ఈసారి పక్కా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే?

Also read :  రికార్డు సృష్టించిన పవన్ కల్యాణ్ కొత్త సాంగ్ !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు