మేము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో కేంద్ర ప్రవేశ పెట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని సమాజ్ వాద్ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు. మళ్లీ పాత పద్ధతిలోనే రిక్రూట్మెంట్ జరగేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.. ఈ విషయాన్ని అఖిలేష్ యాదవ్ X లో చేసిన ఓ పోస్ట్ లో ప్రకటించారు.ప్రస్తుతం దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
Akhilesh Yadav
Delhi: ఢిల్లీలో కీలక పరిణామం.. జగన్ కు మద్దతు తెలిపిన అఖిలేష్ యాదవ్..!
YS Jagan: ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav).. మాజీ సీఎం జగన్ కు మద్దతు తెలిపారు. వైసీపీ నేతలపై దాడులను నిరసిస్తూ ఢిల్లీలో జగన్ ధర్నా చేస్తున్నారు. జంతర్‌మంతర్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. కార్యకర్తలపై దాడులను వైసీపీ ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో ఏర్పాటు చేసింది. ఏపీలోని పరిస్థితులపై వీడియో ప్రదర్శన నిర్వహించింది.
Also Read: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
అఖిలేష్ మద్దతు ..
ఈ నేపధ్యంలో జగన్ ధర్నాకు మద్దతు తెలిపారు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. అధికారం అనేది శాశ్వతం కాదని.. ఇవాళ చంద్రబాబు (Chandrababu) సీఎం అయ్యారు, రేపు జగన్ సీఎం కావచ్చని అన్నారు. అధికారంలోకి వచ్చి ప్రత్యర్థుల ప్రాణాలు తీయడం సరికాదన్నారు. ఏపీలో శాంతియుత వాతావరణం నెలకొనాలని.. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రత్యర్ధుల ప్రాణాలు తీయడం సరికాదని ఉద్ఘాటించారు.
లోకేష్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నారని జగన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 30 మందిని చంపారన్నారు. లోకేష్ రెడ్ బుక్ పెట్టుకుని నచ్చనివారిపై దాడి చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: ఏపీలో ఫ్రీ గ్యాస్ అమలు.. అసెంబ్లీలో కీలక ప్రకటన..!
Akhilesh Yadav: రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ కు చేదు అనుభవం
Akhilesh Yadav: ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్న రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు ప్రయాగ్‌రాజ్‌లోని పుల్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా.. ఆ సభకు భారీగా జనాలు వచ్చి చేరుకున్నారు. సభా వేదికను చేరుకోవడానికి ఇటు ఎస్పీ, అటు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలకు సర్దిచెప్పడానికి రాహుల్, అఖిలేష్ ప్రయత్నించినప్పటికీ వారు వినకపోవడంతో భద్రతా పరమైన సమస్యలు వస్తాయని పోలీసులు హెచ్చరించారు. దీంతో రాహుల్,అఖిలేష్ ప్రసంగించకుండా మధ్యలోనే వెళ్లిపోయారు.
#WATCH | Uttar Pradesh: A stampede-like situation took place in the joint public meeting of Congress MP Rahul Gandhi and Samajwadi Party chief Akhilesh Yadav at Phulpur constituency, in Prayagraj.
Rahul Gandhi and Akhilesh Yadav left the public meeting without addressing the… pic.twitter.com/fPW2tgaWOP
— ANI (@ANI) May 19, 2024
Akhilesh Yadav: ఈడీ, సీబీఐ సంస్థలను బ్యాన్ చేయాలి.. అఖిలేష్ యాదవ్ డిమాండ్
Akhilesh Yadav: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అవసరం లేదని, వాటిని మూసివేయాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దీనిని ప్రతిపక్షాల ఇండియా బ్లాక్‌కు ప్రతిపాదిస్తానని కూడా చెప్పారని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
ఆయన మాట్లాడుతూ.. “సీబీఐ, ఈడీ దేశంలో బ్యాన్ చేయాలి… మీరు మోసం చేసి ఉంటే, దాన్ని ఎదుర్కోవడానికి ఆదాయపు పన్ను శాఖ ఉంది. మీకు సీబీఐ ఎందుకు అవసరం? ప్రతి రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ ఉంది, అవసరమైతే దాన్ని ఉపయోగించండి” అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ ప్రత్యర్థులపై మాత్రమే కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
“ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి లేదా ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడానికి ఈడీ, సీబీఐలను బీజేపీ ప్రభుత్వం ఉపయోగిస్తుందని అన్నారు. దేశంలో డీమోనిటైజేషన్ సమయంలో ఏమి తప్పు జరిగింది అనే దానిపై ఈ దర్యాప్తు సంస్థలు ఎందుకు దర్యాప్తు చేయలేదనిప్రశ్నించారు.
Akhilesh Yadav: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు.. కారణం ఇదే
సమాజ్‌వాద్ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు బుధవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఆయన్ని సాక్షిగా పిలిచింది. దీంతో రేపు అఖిలేషన్ను అధికారులు ప్రశ్నించనున్నట్లు.. దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఏడు జిల్లాల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. 2012 నుంచి 2016 మధ్యకాలంలో రూల్స్ ఉల్లంఘించి అధికారులు గనులు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read: నేను రాజీనామా చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన సుఖ్విందర్ సింగ్
2012-2017 వరకు సీఎంగా అఖిలేష్
ఈ క్రమంలోనే సీబీఐ ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ జరుపుతోంది. 2012 నుంచి 2017 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ విధులు నిర్వహించారు. అంతేకాదు 2012-13 మధ్యకాలంలో మైనింగ్ మత్రింత్వ శాఖ బాధ్యతలను కూడా పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలోనే ఆయనను ఫిబ్రవరి 29న సాక్షిగా హాజరుకావాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసింది.
కాంగ్రెస్‌కు మద్ధతిచ్చిన ఎస్పీ
ఇదిలాఉండగా.. లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ఎక్కువ సీట్లు సాధించేలా గట్టి ప్రయత్నాలను మొదలుపెట్టారు. అంతేకాదు.. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో న్యాయ యాత్రలో కూడా పాల్గొన్నారు. యూపీలో ఆగ్రాకు యాత్ర చేరుకున్నప్పుడు అఖిలేష్ మద్దతు ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఒప్పందం కూడా జరిగింది. సమాజ్‌వాద్ పార్టీ, ఇండియా కూటమి, ఇతర పార్టీలు కలిసి 63 స్థానాల్లో పోటీ చేయనుండగా.. కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనుంది.
Also Read: ఎన్నికల తర్వాత దేశంలో UCC అమలు.. అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు!
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ మద్దతు
లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓవైపు మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ.. మరోవైపు మోదీ సర్కార్‌ను గద్దె దింపాలని విపక్ష పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇటీవల కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రస్తుతం భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ – సమాజ్‌వాద్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒప్పందం కుదిరింది.
Also read: దేశంలో కస్డడీ రేప్ కేసులు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ..
ఇదే మొదటిసారి
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాకు చేరుకున్న తర్వాత అఖిలేష్ పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ యాత్ర ప్రారంభమైన తర్వాత విపక్ష పార్టీలకు చెందిన కీలక నేత ఇందులో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అంతకుముందు కూడా పశ్చిమ బెంగాల్లో యాత్ర కొనసాగేటప్పుడు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ పాల్గొనే అవకాశాలనున్నాయని వార్తలు వచ్చినప్పటికీ ఆమె ఈ యాత్రకు దూరంగా ఉన్నారు.
కుదిరిన సీట్ల సర్దుబాటు
అయితే ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ – సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరాక కొన్ని రోజులకే అఖిలేష్ ఈ యాత్రలో పాల్గొనడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎస్పీ అంగికరించింది. ఇక ఎస్పీ 63 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇదిలాఉండగా.. 2019 మాదిరిగానే.. ఈసారి కూడా ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి దేశ ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.