Actress Nabha Natesh Interview With RTV : సుధీర్ బాబు సరసన ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నబా నటేష్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసి ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ తో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ సినిమాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ తెలంగాణ స్లాంగ్ తో అదరగొట్టింది. అంతకు ముందు ఒకటి రెండు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో సొంతం చేసుకుంది.
ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన ‘డిస్కో రాజా’, సాయి ధరమ్ తేజ్ కి జోడిగా ‘సోలో బ్రతికే సో బెటర్’, బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ‘అల్లుడు అదుర్స్’ వంటి సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలేవి ఈమెకి ఆశించిన స్థాయి విజయాలను అందించలేకపోయాయి. ఆ తరువాత అనుకోకుండా ఓ రోడ్డు ప్రమాదానికి గురి గురి కావడంతో రెండు చోట్ల ఎముకలు విరిగి సర్జరీ చేయించుకుంది. దాంతో ఏడాది పాటు సినిమాలకు దూరమైంది.
మళ్లీ లాంగ్ గ్యాప్ అనంతరం ‘డార్లింగ్’ అనే మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. ప్రియదర్శి సరసన ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా కనిపించనుంది నభా నటేష్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేశాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ జులై 19 న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే నభా నటేష్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్టీవికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన సినీ కెరీర్ తో పాటూ తన యాక్సిడెంట్ గురించి, అలాగే పెళ్లి గురించి కూడా పలు ఆసక్తికర విశేషాలు పంచుకుంది.