Anasuya Emotional Tweet : అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్ గా రాణించిన ఈమె ప్రస్తుతం వెండితెరపై నటిగా దూసుకుపోతోంది. ఇక సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన అందచందాలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ కి కూడా గురౌతుంటుంది. ముఖ్యంగా అనసూయ వేసే బట్టలపై కొందరు నెటిజన్స్ ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. వాటికి ఎప్పటికప్పుడు కాస్త ధీటుగానే రియాక్ట్ అవుతుంది ఈ జబర్దస్త్ బ్యూటీ. అయితే తాజాగా ఆడవాళ్లు ధరించే దుస్తుల వల్లే రేప్ లు జరుగుతున్నాయనే వాదనకు తన అభిమాని పెట్టిన పోస్ట్ కి అనసూయ తన ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయింది.
మన మైండ్ సెట్ మార్చుకుంటే రేప్ లు ఆగుతాయి
అనసూయ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో.. ” అమ్మాయిలు స్కర్ట్ వేసినా లేదా సాంప్రదాయ బట్టలు వేసినా, ఇంటి నుంచి బయటకి వెళ్లినా, ఇంట్లో ఉన్నా ఎవరో ఒకరి మానభంగానికి గురవుతున్నారు. అమ్మాయిలు ధరించే దుస్తుల వల్ల కాదు.. మన మైండ్ సెట్ మార్చుకుంటే ఆడవాళ్లపై మానభంగాలు ఆగుతాయి” అని పోస్ట్ లో పేర్కొన్నారు.
వాళ్ళను చూస్తే గర్వంగా ఉంటుంది
అభిమాని పోస్ట్ చుసిన అనసూయ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ” నేను నా వాళ్ళు అనుకునే వాళ్ళు వీళ్ళు. నన్ను అభిమానించే వాళ్ళు.. కొందరి ఫ్యాన్ పేజీల లాగా ఎవర్ని దూషించరు . ఎవర్ని టార్గెట్ చేయరు. ఎవర్ని ట్రోల్ చేయరు. ఎవర్ని రెచ్చగొట్టరు. ఎవర్ని అగౌరవపరచరు. వీళ్ళు వీళ్ళ బాద్యతల నుంచి పారిపోరు. మంచి మనసుతో ఉండే వారిని చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. ఇక కొందరు ఫ్యాన్ పేజీలను మైంటైన్ చేసేవాళ్ళు గుమ్మడికాయ దొంగలు. అనవసరంగా రెచ్చెగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్లంతా జంతువులుగా ప్రవర్తిస్తుంటారు. అయినా కూడా నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను. ఎందుకంటే నా చుట్టూ ఉన్నవాళ్ళంతా మంచి మనుషులే. వాళ్లకు నేను అండగా ఉంటాను. వాళ్ళను ఎల్లప్పుడూ” అని తన ట్వీట్ లో పేర్కొంది.
This. Is. My. People.
Unlike many “fan pages” .. never abused anyone, never targeted anyone, never gaslighted anyone, never provoked anyone or disrespected anyone unnecessarily, never whitewashed anything, never sought attention for wrong things, never ran away from taking any… https://t.co/LKD6C1LubV— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 24, 2024
Also Read : ఇద్దరు స్టార్ హీరోయిన్లతో విజయ్ రొమాన్స్.. తలపతి లాస్ట్ మూవీలో నటించేది వీళ్లేనా?