IPL 2024: జయ్‌ షా గారు.. ఈ మాత్రం దానికి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎందుకండి.. పీకేయండి!

రానున్న ఐపీఎల్‌ సీజన్‌ మొదటి నెలలో ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ సెలక్షన్‌ ఉండనుందని బీసీసీఐ చెబుతోంది. జనవరి 11నుంచి జరగనున్న అఫ్ఘాన్ సిరీస్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వదని అంటోంది.

IPL 2024: జయ్‌ షా గారు.. ఈ మాత్రం దానికి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎందుకండి.. పీకేయండి!
New Update

వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌(WTC) ఫైనల్‌ అస్సాం అయ్యింది.. వన్డే వరల్డ్‌కప్‌(CWC) ఫైనల్‌ ఆసీస్‌ సునామీలో గల్లంతయ్యింది. ఓవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడాల్సినన్ని మ్యాచ్‌లు ఆడి.. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ని ప్రాక్టిస్‌ లాగా క్యాష్‌ చేసుకోని.. తగినంత రెస్ట్ తీసుకోని వరల్డ్‌కప్‌లో పక్కా ప్లాన్‌తో దిగి ట్రోఫి పట్టుకుపోయారు. మరోవైపు భారత్‌ మేధావి క్రికెటర్లు మాత్రం ఐపీఎల్‌లో అన్నీ మ్యాచ్‌లు ఆడేశారు.. అది సరిపోదు కదా.. ఆఖరికి వన్డే ప్రపంచకప్‌కు అర్హత కూడా సాధించని వెస్టిండీస్‌పై వన్డేలు, టెస్టులు రెస్ట్ లేకుండా ఆడేశారు. అసలు చిన్నజట్లపై కోహ్లీ, రోహిత్ ఎందుకు ఆడారో..! మే బీ రికార్డుల కోసం కావొచ్చు.. ఎంతైన వారి ఫ్యాన్స్‌కు కూడా కావాల్సినవి అవే కదా..! ఒకే ఈ కార్పొరేట్‌ స్టైల్‌ ఫ్యాన్స్‌ థింకింగ్‌ను పక్కన పెడదాం.. ఇక్కడ ఐపీఎల్‌ని తప్పు పట్టడం లేదు.. తక్కువ కూడా చేయడం లేదు. ఎంతోమంది యువ క్రికెటర్లకు ఐపీఎల్‌ ఓ వరం. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అయితే కేవలం ఐపీఎల్‌నే ప్రమాణికంగా తీసుకోని జట్టును సెలక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్?

అఫ్ఘాన్ సిరీస్‌కు కోహ్లీ, రోహిత్:

2022 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై సెమీస్‌ ఓటమి తర్వాత రోహిత్‌, కోహ్లీ అంతర్జాతీయంగా ఈ పొట్టి ఫార్మెట్‌కు దూరంగా ఉంటున్నారు. ఇక వన్డే వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత జరిగిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లకు రెస్ట్ తీసుకున్నారు. ఈ ఏడాది(2024)జూన్‌లో టీ20 వరల్డ్‌కప్‌ ఉంది. దీని కోసం సెలక్టర్లు యువ జట్టును ఎంపిక చేసే పనిలో ఉన్నారు. చాలా మంది ప్లేయర్లను టెస్ట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై జరిగిన టీ20 సిరీస్‌లలో అదే చేశారు. ఇదంతా ఎందుకు ? టీ20 వరల్డ్‌కప్‌ గెలవడం కోసం కదా..! ఇప్పటివరకు అందరూ ఇలానే అనుకున్నారు.. కానీ అంతా తూచ్‌ అంటోంది బీసీసీఐ. రానున్న ఐపీఎల్‌ సీజన్‌ మొదటి నెలలో ఎవరైతే బాగా రాణిస్తారో వారికే టీ20 వరల్డ్‌కప్‌లో ప్లేస్‌ అంటోంది. ఇటు ఇదే సమయంలో ఇక టీ20లకు దూరంగా ఉంటారనుకున్న కోహ్లీ, రోహిత్‌.. జనవరి 11 నుంచి అఫ్ఘాన్‌పై స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్‌ ఆడుతామని చెప్పడంతో సెలక్షన్‌ కమిటీ తల పట్టుకుంది.



ఐపీఎల్‌ ఆటబట్టే తీసుకుంటాం:

ఐపీఎల్‌లో సెంచరీలకు సెంచరీలు చేసి.. బౌలర్లను ఉతికి ఆరేసిన బ్యాటర్లు అంతర్జాతీయ మ్యాచ్‌లో రాణించవచ్చు.. రాణించలేకపోవచ్చు కూడా. ఎందుకంటే ఐపీఎల్‌ టోర్నీ మొత్తం థార్‌రోడ్డుల్లాంటి బ్యాటింగ్‌ ట్రాక్‌లపై జరుగుతుంది. కొన్ని జట్లు తమ స్టేడియం పేర్లకు తగ్గట్టుగా 'చిన్న'గా బౌండరీ డిస్టెన్స్‌ను పెట్టుకుంటాయి. ఎడ్జ్‌ కట్‌ అయినా సిక్సే పోతుంది. ఇలా ఐపీఎల్‌లో రికార్డులు సృష్టించే బ్యాటర్లు తీరా అంతర్జాతీయ మ్యాచ్‌లకు వచ్చే సరికి తేలిపోతున్నారు. అయితే అందరూ అలానే ఉన్నారని కాదు కానీ.. టీ20 వరల్డ్‌కప్‌ సెలక్షన్‌కి ఐపీఎల్‌ ఒక్కటే కోలమానం కాదు. అంతర్జాతీయ మ్యాచ్‌ల స్టాండర్డ్స్‌ వేరు.. ఐపీఎల్‌ లెవల్‌ వేరు. సెలక్టర్లు ఇది గమనించుకోవాలి. ఇక సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఫిట్‌గా లేరని.. అఫ్ఘాన్ సిరీస్‌తో ఏం చెప్పలేమని.. ఐపీఎల్ మొదటి నెలను బట్టి వరల్డ్‌కప్‌ సెలక్షన్‌తో పాటు మిగిలినవన్నీ నిర్ణయిస్తామని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు న్యూస్ ఏజెన్సీ పీటీఐకి చెప్పారు. దీనిపైనే ఫ్యాన్స్‌ పెదవి విరుస్తున్నారు. ఈ మాత్రం దానికి అఫ్ఘాన్‌తో సిరీస్‌ ఎందుకు.. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఎందుకు జయ్‌ షా గారు అని ప్రశ్నిస్తున్నారు.

Also Read: ఈ వీడియో చూస్తే విరాట్‌ ఆ రోజు ఎంత బాధపడ్డాడో అర్థమవుతుంది.. 😭!

WATCH:

#rohit-sharma #virat-kohli #ipl-2024 #cricket #india-vs-afganisthan #sports-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe