Sweden: స్వీడెన్‌లోనూ ఎంపాక్స్ వైరస్..మొదట కేసు నమోదు

ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న వైరస్ ఎంపాక్స్. ఆఫ్రికాలో ఇప్పటికే ఇది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు స్వీడన్‌లో కూడా మంకీ పాక్స్ వైరస్ మొదటి కేసు నమోదయింది. దీన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ ధృవీకరించింది.

New Update
Sweden: స్వీడెన్‌లోనూ ఎంపాక్స్ వైరస్..మొదట కేసు నమోదు

Monkey Pox Virus: ఆఫ్రికాలో మంకీ పాక్స్ వైస్ భయెడుతోంది. ఇక్కడ రోజురోజకూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆఫ్రికన్‌ యూనియన్ హెల్త్‌ వాచ్‌డాగ్‌ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వ్యాప్తి అనేక ఆఫ్రికన్ దేశాలలో , ముఖ్యంగా డెమోక్రాటిక్‌ రిపబ్లిక్ ఆఫ్‌ కాంగోలో అతిగా వ్యాపిస్తుంది. మంకీపాక్స్ ను కాంటినెంటల్ సెక్యూరిటీ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా (Health Emergency) ప్రకటిస్తున్నాము” అని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధిపతి జీన్ కసేయా చెప్పారు.కరోనా కంటే మంకీ పాక్స్ డేంజర్ అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మంకీ పాక్స్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

మంకీపాక్స్ ఇప్పుడు సరిహద్దులను కూడా దాటింది. ఇప్పటివరకు ఆఫ్రికాలోనే విజృంభిస్తున్న ఈ మహమ్మారి తాజాగా మిగతా దేశాలకూ వ్యాపిస్తోంది. తమ దేశంలో ఎంఆక్స్ వైరస్ మొదటి కేసు నమోదయిందని స్వీడన్ ప్రకటించింది. తమ దేశంలో ఒక వ్యక్తి దీంతో బాధపడుతున్నారని ఆదేశ ఆరోగ్యశాఖ తెలిపింది.

Also Read: GAZA: బర్త్ సర్టిఫికేట్ తేచ్చేలోపు..సర్వనాశనం

Advertisment
తాజా కథనాలు