Lok Sabha Elections : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్.. తెరపైకి ప్రియాంక గాంధీ పేరు..

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రోజుకో కొత్త పేరు వస్తోంది. తాజాగా మరోసారి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేరు వినిపిస్తోంది. ప్రియాంక గాంధీ తరఫున రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నామినేషన్ వేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Lok Sabha Elections : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్.. తెరపైకి ప్రియాంక గాంధీ పేరు..
New Update

Congress : ఖమ్మం(Khammam) పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం నేతలు తెరపైకి రోజురోజుకు కొత్త పేర్లు తీసుకొస్తున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పేరు వినిపిస్తోంది. ప్రియాంక గాంధీ తరఫున రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) నామినేషన్ వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్‌ కోసం మంత్రులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మల్లు నందిని టికెట్‌ కోసం భట్టి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కేరళ వెళ్లి కేసీ వేణుగోపాల్‌ను భట్టి కలిశారు. మరో 24 గంటల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది.

Also Read: ఈరోజు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర..

మరికొన్ని గంటల్లోనే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలనుంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల్లో విజయం సాధించిన హస్తం పార్టీ.. లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) ల్లో కూడా అత్యధిక స్థానాలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈరోజు నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇదిలాఉండగా ఏప్రిల్ 19 నుంచి మొదలైన పార్లమెంట్ ఎన్నికలు ఏడు దశల్లో జూన్ 1 వరకు జరగనున్నాయి. మే 13న తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Also Read: భార్య కాపురానికి రాలేదని అత్తపై దారుణం.. నిద్రలో ఉండగా!

#telugu-news #telangana-news #khammam #priyanka-gandhi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe