Surya Kumar Yadav: ఈసారి టీ20 బ్యాచ్‌లకు కెప్టెన్ మార్చేసింది బీసీసీఐ. శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20ల, మూడు వన్డేలు ఆడనుంది. ఇందులో టీ20లకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది బీసీసీఐ. జూలై 27 నుంచి ఆగస్ట్ 7 వరకు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలి టీ20 జూలై 27న జరగనుంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్లు జట్టు మీద, కెప్టెన్ నిర్ణయం మీద బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని బీసీసీఐ తెలిపింది.
సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టుకు సారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జింబాబాబ్వేతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శుభ్‌మన్ గిల్ ను ఈ టూర్‌లో రెండు సిరీస్‌లకు వైస్ కెప్టెన్‌గా నియమించారు. వ్యక్తిగత కారణాల వల్ల శ్రీలంకతో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరంగా ఉంటున్నాడు. మరోవైపు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారు. అయితే టీ20లకు కెప్టెన్‌గా ఉండనున్న స్కై వన్డేల్లో మాత్రం అస్సలు ఆడడం లేదు.
టీ20 జట్టు: సూర్యకుమార్, గిల్, జైశ్వాల్ ,రింకూ సింగ్, పరాగ్, పంత్, సంజూ, పాండ్యా, దూబే, అక్షర్ పటేల్, సుందర్, రవిబిష్నోయ్, అర్ష్‌దీప్, ఖలీల్, సిరాజ్.
వన్డే జట్టు: రోహిత్‌శర్మ, కొహ్లీ, గిల్, రాహుల్, పంత్, శ్రేయాస్, దూబే, కుల్దీప్,సిరాజ్, సుందర్, అర్ష్‌దీప్, పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రానా
Also Read:Jammu-kashmir: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం