Prajwal Revanna: ఎక్కడున్నా వచ్చి లొంగిపో.. ప్రజ్వల్‌ రేవణ్ణకు.. దేవెగౌడ వార్నింగ్

కర్ణాటకలో లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ విదేశాలు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని తాత, మాజీ ప్రధాని దేవెగౌడ.. ప్రజ్వల్‌ను ఇండియాకు వచ్చి లొంగిపోవాలని సూచించారు. తన సహనాన్ని ఇక పరీక్షించకూడదంటూ హెచ్చరించారు.

New Update
Prajwal Revanna: ఎక్కడున్నా వచ్చి లొంగిపో.. ప్రజ్వల్‌ రేవణ్ణకు.. దేవెగౌడ వార్నింగ్

Deve Gowda Warns Grandson Prajwal Revanna: మాజీ ప్రధాని దేవగౌడ మనువడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన రాసలీలల వీడియోలు (Prajwal Revanna Videos) ఇటీవల బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల కేసులో ఇరుకున్న ప్రజ్వల్‌.. చివరికి విదేశాలకు పారిపోయాడు. అయితే తాజాగా దేవెగౌడ ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజ్వల్‌ రేవణ్ణకు వార్నింగ్ ఇస్తూ ఓ లేఖను పోస్టు చేశారు. ప్రజ్వల్ ఎక్కడున్న వెంటనే ఇండియాకు తిరిగివచ్చి న్యాయ ప్రక్రియను ఎదుర్కోవాలని సూచించారు. నా సహనాన్ని ఇంకా పరీక్షంచకూడదంటూ హెచ్చరించారు. తనపై అతడికి ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా వెంటనే తిరిగిరావాలంటూ ఆకాంక్షించారు.

Also Read: జూన్ 4న వాళ్లు మంచినీళ్లు అందుబాటులో పెట్టుకోండి: ప్రశాంత్ కిషోర్

గత కొన్ని వారాల నుంచి తనపై, తన కుటుంబ సభ్యులపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజ్వల్ వ్యవహారంలో నిజాలు వెలుగులోకి వచ్చేవరకు తాను ఎదురుచూస్తానని దేవెగౌడ పేర్కొన్నారు. ప్రజ్వల్ చేసిన పనులు తనకు తెలియదని.. ప్రజలను బుజ్జగించే ప్రయత్నం కూడా తాను చేయనని స్పష్టం చేశారు. అతడి విదేశీ ప్రయాణం గురించి తనకు తెలియదని చెప్పారు. కానీ ప్రజ్వల్ మనస్సాక్షి జవాబు చెప్పుకోవాల్సి ఉందన్నారు. ఆ దేవుడినే నమ్ముతానని వాస్తవమేమిటనేది ఆ దేవుడికి తెలియాలంటూ పేర్కొన్నారు.

ఇదిలాఉండగా.. లోక్‌సభ ఎన్నికల వేళ.. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన రాసలీల వీడియోలు బయటపడటం దుమారం రేపాయి. విషయం బట్టబయలుకావడంతో ప్రజ్వల్ వెంటనే జర్మనీకి పారిపోయారు. ఈ ఎన్నికల్లో బీజేపీ (BJP), జేడీఎస్‌లు (JDS) కర్ణాటకలో కలిసి పోటీకి దిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలపై ఇండియా కూటమి నేతలు ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే ప్రజ్వల్‌ రేవణ్ణను ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తోంది.

Also Read: రేవ్‌ పార్టీ సూత్రధారి తెలుగువాడే.. దోసెలమ్మి రూ.కోట్లకు ఎదిగి..!

Advertisment
తాజా కథనాలు