Arvind Kejriwal : కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

లోక్‌సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టీస్ సంజీవ్ కన్నా, జస్టీస్ దిపాన్‌కర్ దత్తాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేయనుంది. అయితే కేజ్రీవాల్‌కు ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇస్తుందా లేదా అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

New Update
CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌‌కు సుప్రీం కోర్టు ఝలక్

Delhi CM : ప్రస్తుతం తీహార్ జైల్లో(Thihar Jail) ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal).. లోక్‌సభ ఎన్నికల వేళ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు(Supreme Court) లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించేందుకు న్యాయస్థానం కూడా అంగీకరించింది. అయితే ఈరోజు(మంగళవారం) కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారించనుంది. జస్టీస్ సంజీవ్ కన్నా, జస్టీస్ దిపాన్‌కర్ దత్తాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేయనుంది. అయితే కేజ్రీవాల్‌కు ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇస్తుందా లేదా అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read: నిలిచిపోయిన సునితా విలియమ్స్ రోదసి యాత్ర..

ఇదిలాఉండగా.. ఇటీవల కేజ్రీవాల్‌ లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) జరుగుతున్న నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆయన మధ్యంత బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. మధ్యంత బెయిల్‌ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పింది. అయితే మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను తాము వ్యతిరేకిస్తామని ఈడీ తరఫు అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు కోర్టులో వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కేవలం పిటిషన్‌ మాత్రమే విచారిస్తామని.. బెయిల్ ఇస్తామని చెప్పడం లేదని తెలిపింది. చివరికి బెయిల్ ఇవ్వొచ్చు లేదా ఇవ్వకపోవచ్చు అని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ.. కేడ్రీవాల్‌ జైలు నుంచి విడుదలవుతారా లేదా అనేది ఈరోజు తెలియనుంది.

Also read: ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు కవిత..

Advertisment
తాజా కథనాలు