సనాతనం ధర్మం మీద వ్యాఖ్యలు...సుప్రీంకోర్టు నోటీసులు

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దాని మీద విచారణ చేసిన కోర్టు ఉదయనిధికి నోటీసులను జారీ చేసింది.

సనాతనం ధర్మం మీద వ్యాఖ్యలు...సుప్రీంకోర్టు నోటీసులు
New Update

సనాతనం ధర్మం మీద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. స్టాలిన్ మాటలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా చాలా మంది మండిపడ్డారు. చివరకు ఇవి సుప్రీంకోర్టు వరకూ వెళ్ళాయి. ఉదయనిధి మీద చర్యలు తీసుకోవాలంటూ అత్యున్నత న్యాస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. దీన్ని విచారణ చేసిన కోర్టు ఈ రోజు తమిళనాడు మంత్రికి నోటీసులను జారీ చేసింది.ఉదయనిధితో పాటూ ఏ.రాజా, మరో 14 మందికి ఈ నోటీసులను పంపింది. ఇందులో సీబీఐ అధికారులతో పాటూ తమిళనాడు పోలీసులు కూడా ఉన్నారు.

సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలతో పోల్చారు ఉదయనిధి స్టాలిన్. ఇలాంటి వాటిని కేవలం వ్యతిరేకించి ఊరుకుంటే సరిపోదని...వేళ్ళతో నిర్మూలించాలని వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. అక్కడితో ఊరుకోలేదు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత కూడా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని స్టాలిన్ మరోసారి చెప్పారు. తాను అన్నది అక్షరాల నిజమని...వాటిని వెనక్కు తీసుకోనని ఆయన ప్రకటించారు. మనుషుల మధ్య ఉన్న అంటరాని తనం నశించాలంటే...సనాతన ధర్మాన్ని నాశనం చేయాల్సిందే అన్నారు. అప్పుడే అంటరాని తనం పూర్తిగా పోతుందని స్పష్టం చేశారు. సనాతన ధర్మం వల్లనే అంటరాని తనం వచ్చిందని....ఈ రెండు కవల పిల్లలని స్టాలిన్ వ్యాఖ్యానించారు. సనాతనం ధర్మం నశిస్తే అంటరానితనం స్వయంచాలకం అవుతుందని చెప్పారు.

ఉదయనిధి వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారాన్ని లేపాయి. బీజేపీ ఈ వ్యాఖ్యలపై మండిపడింది. స్టాలిన్ ను అరెస్ట్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చాయి. ఈతని చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ 262 మంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ కూడా రాశారు. ఇందులో మాజీ జడ్జిలు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. మరోవైపు మద్రాసు హైకోర్టు కూడా ఈ విషయం మీద స్పందించింది. రాజ్యాంగంలో పౌరులకు కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేషంగా మారకూడదని సూచించింది. ముఖ్యంగా మతానికి సంబంధించి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని...ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరముందని చెప్పింది.

#comments #minister #supreme-court #tamilnadu #judges #verdict #notices #udhayanidhi-stalin #sanatana-dharama
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe