The Supreme Court's Decision To Solve a Liquor Case Within Six Months : ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)కేసు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై దాదాపు ఏడాదిన్నరగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటకే ఈ స్కామ్‌లో ఇరుక్కున్న ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరికొందరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు స్పందించింది. సీబీఐ, ఈడీలకు కీలకు సూచనలు చేసింది. ఆరు నెలల్లోగా లిక్కర్ కేసు దర్యాప్తును పూర్తిచేయాలని ఆదేశించింది. విచారణకు ముందు ప్రజలను కటకటాల వెనుక ఉంచలేరని.. సీబీఐ ఆరోపిస్తున్న దానికి.. ఈడీ ఆరోపిస్తున్న దానికి మధ్య వైరుధ్యం ఉందని తెలిపింది.
Also read: కొత్త సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ..మరి కాసేపట్లో ఢిల్లీకి ప్రయాణం
ఇదిలా ఉండగా.. ఢిల్లీ(Delhi) లిక్కర్ స్కామ్ కేసులో గతంలో ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈడీ ఆమెను విచారణ కూడా చేసింది. చాలామంది కవిత అరెస్టు అవుతుందని అనుకున్నారు. కానీ ఆమె అరెస్టు కాకపోవడంతో తెలంగాణ ప్రజల్లో అయోమయం నెలకొంది. అయితే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసును ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించడం చర్చనీయాంశమవుతుంది. ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి పురోగతి వస్తుందో.. ఇంకా ఎవరెవరు అరెస్టు అవుతారా అనే దానిపై సర్పత్రా ఆసక్తి నెలకొంది.
Also read: అందుకే విద్యుత్‌శాఖ సమీక్షకు నేను వెళ్లలేదు.. సీఎండీ ప్రభాకర్ రావు సంచలన వ్యాఖ్యలు