Supreme Court : జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లో ఉండాలా..? సుప్రీంకోర్టులో పిటిషన్ జీవిత ఖైదు అంటే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలా ? లేకా CRPC సెక్షన్ 432 కింద ఆ శిక్షను తగ్గించడం లేదా రద్దు చేయొచ్చా అనే దానిపై ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై స్పందన కోరుతూ సుప్రీం ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. By B Aravind 10 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Supreme Court Petition : ఓ ఆసక్తికరమైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) లో అంగీకరించింది. అసలు జీవిత ఖైదు(Life Imprisonment) అంటే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలా ? లేకా CRPC సెక్షన్ 432 కింద ఆ శిక్షను తగ్గించడం లేదా రద్దు చేయొచ్చా అనే దానిపై వివరణ ఇవ్వాలని కోరుతూ.. చంద్రకాంత్ ఝూ అనే వ్యక్తి పిటషన్ వేశారు. అయితే దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీం అంగీకరించింది. 2006, 2007లలో తీహార్ జైలు బయట ముడు తలలేని మొండెంలా కేసులో దోషిగా తేలిన చంద్రకాంత్ ఝూ(Chandrakant Jha) ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. Also Read: బ్యాంకులను అప్పుల ఊబిలో పడేసింది కాంగ్రెసే.. నిర్మలమ్మ సంచలన ఆరోపణలు ఈ నేపథ్యంలో తాజాగా చంద్రకాంత్ ఈ పిటిషన్ వేశాడు. అతని తరఫు న్యాయవాది రిషి మల్హోత్రా ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో.. IPC సెక్షన్లు 302, 201ల కింద చంద్రకాంత్‌కు శిక్ష విధించారని తెలిపారు. ట్రయల్ కోర్టు గతంలో తనకి మరణశిక్ష విధిస్తే.. ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని పేర్కొన్నారు. యావజ్జీవ కారాగార శిక్షను జీవితాంతం వరకు పరిగణించినట్లైతే.. అది దోషిగా ఆ వ్యక్తి ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లు అవుతుందని పిటిషన్‌లో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు రెమిషన్ కింద అందించే శిక్ష తగ్గింపు అవకాశాలను వాళ్లకి దక్కకుండా చేయడమేనని అన్నారు. దీంతో చంద్రకాంత్ పిటిషన్‌పై స్పందన కోరుతూ.. జస్టీస్ హృషికేశ్ రాయ్, జస్టీస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. Also Read: భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు.. ఎప్పటి నుంచంటే.. #telugu-news #national-news #supreme-court #delhi-high-court #life-imprisonment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి