Sunitha Williams: ఎటకేలకు వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు ఎప్పుడు వస్తారనేది స్పష్టం చేసింది నాసా. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌లో గత జూన్ 5న భారత సంతతి ఆస్ట్రోనాట్ అయిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. వీరిని తీసుకెళ్లిన స్టార్‌లైనర్ ప్రొపల్షన్‌తో సమస్యలు తలెత్తడంతో వారు 80 రోజులుగా అక్కడే ఉండిపోయారు. ఇప్పటి వరకు వ్యోమగాములు ఇద్దరూ ఎలా వస్తారో కూడా తెలియలేదు. అయితే తాజాగా నాసా ఒక ప్రకటన చేసింది. సునీతా విలయమ్స్, బచ్ లు వచ్చే డాది వస్తారని తెలిపింది. వారు వెళ్ళిన స్టార్ లైనర్ పాడైన కారణంగా అందులోనే మళ్ళీ తీసుకురావడం ప్రమాదకరమని చెప్పింది. వచ్చే ఏడాది ప్రారంభంలో మరో స్పేస్ షిప్‌ను అంతరిక్షంలోకి పంపించి..వారిద్దరినీ తీసుకువస్తామని నాసా చెప్పింది.
మరోవైపు వ్యోమగాములు ఆరోగ్యం మీద ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుస్తోంది. వీరు మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉందని యూఎస్ మిలటరీ స్పేస్ సిస్టమ్ మాజీ కమాండర్ రుడీ రిడాల్ఫ్ చెబుతున్నారు. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సురక్షితంగా భూమి మీదకు రావాలంటే..సర్వీస్ మాడ్యూల్ సరిగ్గా అతుక్కోవాలని...క్యాప్సూల్‌ను సరైన కోణంలో అంటిపెట్టుకుంటేనే వారు సేఫ్‌గా భూమికి పైకి తిరిగి రాగలుగుతారని చెబుతున్నారు. మాడ్యూల్ కోణం ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా రాపిడి జరిగి మంటలు పుడతాయని రుడీ చెప్పారు. దీనివలన ఆస్ట్రోనాట్స్ మాడి మసవుతారని అంటున్నారు. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ ల సురక్షితత మీద మరిన్ని అనుమానాలు చెలరేగుతున్నాయి.
దాంతో పాటూ అంతరిక్షంలో గురుత్వాకర్షణ సున్నాగా ఉంటుంది. దీంతో కండరాలకు ఎముకలకు బరువులు ఎత్తే పని ఉండదు. కాలక్రమేణా, కండరాల ఫైబర్స్ బలహీనపడతాయి. ఎముక కూడా బలహీనపడి విరిగిపోయే అవకాశం ఉంది. రోజంతా అంతరిక్షంలో ఉండడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి చూపు మసకబారుతుందని, డబుల్ విజన్ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: Amith Shah: 2026 నాటికి నక్సలిజం ఉండదు– కేంద్ర హోంమంత్రి అమిత్ షా