Sunitha Williams: ఎటకేలకు వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు ఎప్పుడు వస్తారనేది స్పష్టం చేసింది నాసా. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌లో గత జూన్ 5న భారత సంతతి ఆస్ట్రోనాట్ అయిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. వీరిని తీసుకెళ్లిన స్టార్‌లైనర్ ప్రొపల్షన్‌తో సమస్యలు తలెత్తడంతో వారు 80 రోజులుగా అక్కడే ఉండిపోయారు. ఇప్పటి వరకు వ్యోమగాములు ఇద్దరూ ఎలా వస్తారో కూడా తెలియలేదు. అయితే తాజాగా నాసా ఒక ప్రకటన చేసింది. సునీతా విలయమ్స్, బచ్ లు వచ్చే డాది వస్తారని తెలిపింది. వారు వెళ్ళిన స్టార్ లైనర్ పాడైన కారణంగా అందులోనే మళ్ళీ తీసుకురావడం ప్రమాదకరమని చెప్పింది. వచ్చే ఏడాది ప్రారంభంలో మరో స్పేస్ షిప్‌ను అంతరిక్షంలోకి పంపించి..వారిద్దరినీ తీసుకువస్తామని నాసా చెప్పింది.
పూర్తిగా చదవండి..NASA: సునీతా విలియమ్స్ రాక వచ్చే ఏడాది–నాసా
80రోజులుగా అంతరిక్షంలో ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు ఇప్పుడప్పుడే రాలేరని తేల్చి చెప్పింది నాసా. వారు వచ్చే ఏడాది తిరుగు ప్రయాణమవుతారని నాసా అధికారికంగా ప్రకటించింది. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్య్రూ డ్రాగన్‌లో వచ్చే ఫిబ్రవరిలో వస్తారని నాసా తెలిపింది.
Translate this News: