Cricket:కవర్లకు కూడా డబ్బులు లేవా...వైరల్ అవుతున్న సునీల్ గవాస్కర్ కామెంట్స్

టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. స్టేడియం మొత్తాన్ని కప్పకపోవడం వల్లన మ్యాచ్ క్యాన్సిల్ అయింది. దీనిపై స్పందిస్తూ.. కనీసం మైదానాన్ని కప్పేందుకు కూడా దక్షిణాఫ్రికా బోర్డు వద్ద డబ్బులు లేవా..అంటూ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు.

New Update
Cricket:కవర్లకు కూడా డబ్బులు లేవా...వైరల్ అవుతున్న సునీల్ గవాస్కర్ కామెంట్స్

భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య డర్బన్ వేదికగా ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.సరిగ్గా మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడింది. అది ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచును రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించాలని భావించినా.. అది కూడా సాధ్యం కాలేదు. దీంతో ప్రారంభం మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.

Also Read:ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమైనది-ప్రధాని మోదీ

మరోవైపు వర్షం పడుతుండగా మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా వర్షం కురుస్తున్న సమయంలో ఏ క్రికెట్ స్టేడియాన్ని అయినా.. మైదానంలోని ప్రతీ మూల కవర్లతో కప్పి ఉంచుతారు. కానీ ఆదివారం డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో అలా జరగలేదు. కేవలం పిచ్‌ను.. దాంతో పాటు 30 యార్డ్ సర్కిల్‌ను మాత్రమే కవర్లతో కప్పి ఉంచారు. మిగతా భాగాన్ని అలాగే ఉంచేశారు. దీని మీద చాలా మంది మండిపడుతున్నారు. టీమ్ ఇండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం విమర్శలు గుప్పించారు.

వర్షం పడుతుంటే మైదానాన్ని కవర్లతో కప్పకుండా ఎలా ఉంచుతారు అంటూ సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్టును ప్రశ్నించారు సునీల్ గవాస్కర్.అన్ని స్టేడియాల్లో చేసేట్టుగానే గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచాలని సూచించారు. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచాలి. అలా ఉంచకపోతే ఒకవేళ వర్షం ఆగినా.. గంట వరకు మ్యాచ్ ప్రారంభం కాదని మీకు తెలియదా అంటూ విరుచకుపడ్డారు. మ్యాచ్ కోసం మైదానాన్ని సిద్ధం చేశాక.. అకస్మాత్తుగా వర్షం వస్తే ఏం చేయలేం. కానీ వర్షం వస్తుందని తెలిసినప్పుడు పూర్తిగా కప్పేయాలి కదా. ప్రతి క్రికెట్ బోర్డు దగ్గరా డబ్బు ఉంది. చాలా డబ్బు వస్తోంది. అందులో అనుమానం లేదు. ఒకవేళ డబ్బు లేదని, రావడం లేదని చెబితే అది అబద్ధం అవుతుంది. బీసీసీఐ దగ్గర ఉన్నంత డబ్బు మిగతా బోర్డుల దగ్గర ఉండకపోవచ్చేమో.. కానీ మైదానాన్ని పూర్తిగా కప్పేసేందుకు అవసరమైన కవర్లు కొనుగోలు చేయడానికి కావాల్సిన డబ్బు కూడా లేదా అంటూ చీల్చి చెండాడేశారు సునీల్ గవాస్కర్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇంతకు ముందు కూడా ఇలా వర్షం పడి చాలా మ్యాచ్ లు రద్దయ్యాయి. టీమ్ లు చెరో పాయింట్ పంచుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దాదాపు అన్ని దేశాలు వర్షం పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కవర్లతో కప్పి ఉంచుతున్నారు. దక్షిణాఫ్రికా కూడా ఇదే పద్ధతిని పాటించాలని సునీల్ గవాస్కర్ సూచించారు. ఇక టీ20 సీరీస్ లో భాగంగా రేపు రెండో మ్యాచ్ జరగనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు