Schools : రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు(Summer Holidays) ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు అన్ని రకాల మేనేజ్‌మెంట్ల పరిధిలోని పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ వేసవి సెలవుల్లో ఎవరైన ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తే.. కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక జూన్ మళ్లీ పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.
Also Read: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్.. తెరపైకి ప్రియాంక గాంధీ పేరు..
ఈ విద్యా సంవత్సరం(Academic Year) లో పాఠశాలలకు మంగళవారమే చివరి పనిదినంగా ఉంది. ఈ సందర్భంగా ఇటీవల ముగిసిన సమ్మెటివ్ అసెస్మెంట్ - 2 పరీక్ష ఫలితాలను మంగళవారం పాఠశాలలో ప్రకటించారు. మరికొన్ని పాఠశాలలో వీటికి సంబంధించి చిన్న వేడుకలను కూడా నిర్వహించారు. మరోవైపు బయట ఎండలు కూడా రోజురోజుకి పెరగడంతో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కూడా నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్కడ కూడా జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
Also Read: ఈరోజు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర..