/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-09T215809.050.jpg)
ఏపీలో వేసవి సెలవులను పొడిగించారు. మే 12 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉండగా.. 13న రీఓపెన్ అవుతాయని వెల్లడించింది. ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం మరొక రోజును సెలవును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 13న రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి.