Ind Vs Pak World Cup 2023:స్టార్ వచ్చేస్తున్నాడు...ఇషాన్, సిరాజ్ డౌటే.

వరల్డ్‌కప్‌లో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో గెలిచి మంచి ఊపు మీదున్న టీమిండియా మరో రెండు రోజుల్లో పాకిస్తాన్‌తో తలపడడానికి రెడీ అవుతోంది. ఈ కీలక మ్యాచ్ కు భారత్ కు అదనపు ఉత్సాహం జత అవుతోంది. ఇప్పటివరకు డెంగ్యూతో టీమ్ కు దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చేశాడు.

New Update
Ind Vs Pak World Cup 2023:స్టార్ వచ్చేస్తున్నాడు...ఇషాన్, సిరాజ్ డౌటే.

Ind Vs Pak World Cup 2023: శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ అవనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టికె్టస్ అన్నీ బుక్ అయిపోయాయి. మ్యాచ్ కోసం గవర్నమెంట్ అహ్మదాబాద్‌కు (Ahmedabad) స్పెషల్ ట్రైన్స్ వేసింది. బీసీసీఐ మ్యాచ్ ముందు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. రెండు మ్యాచ్‌లు గెలిచి ఉత్సాహంగా ఉన్న బారత జట్టు కూడా పాకిస్తాన్‌ను ఓడించి తమ జైత్రయాత్రను కంటిన్యూ చేయాలని అనుకుంటోంది.

వరల్డ్‌కప్‌లో ఇండియా ఆడిన రెండు మ్యాచ్‌లలో కీలక ఆటగాళ్ళు అందరూ బాగా ఆడారు. అయితే ఓపెనర్ ఇషాన్ కిషన్ మాత్రం రెండు మ్యాచ్‌లలోనూ ఫెయిల్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) డెంగ్యూ బారిన పడడంతో అతని ప్లేస్‌లో ఇషాన్ వచ్చాడు. అయితే ఇప్పుడు మూడో మ్యాచ్‌కు ఇంక ఆ ప్రబ్లెమ్ లేదని తెలుస్తోంది. స్టార్ ఓపెనర్ వచ్చేస్తున్నాడని చెబుతున్నారు. డెంగ్యూ నుంచి కోలుకున్న శుభ్‌మన్ జట్టుతో జాయిన్ అయ్యాడు. అహ్మదాబాద్‌కు కూడా చేరుకున్నాడు. అంతకన్నా మంచి వార్త ఏంటంటే నిన్న అక్కడ ప్రాక్టీస్ కూడా చేసాడు. దీంతో శనివారం జరిగే మ్యాచ్ కు గిల్ ఆడడం గ్యారంటీ అని సమాచారం. అయితే టీమ్ మేనేజ్ మెంట్ మాత్రం ఈ విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. పాక్‌తో మ్యాచ్‌లో తుది జట్టులో గిల్ కనుక ఉంటే రోహిత్ శర్మతో (Rohit Sharma) పాటూ గిల్ ఓపెనర్‌గా దిగుతాడు. 3,4,5 స్థానాల్లో విరాట్ (Virat Kohli), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆడతారు.

అఫ్ఘాన్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కూడా రాణించాడు. దీంతో నెక్స్ట్ దానిలో కూడా అతనినే తీసుకుంటారని తెలుస్తోంది. అప్పుడు సూర్యకుమార్ యాదవ్ బెంచ్ కే పరిమితం అవుతాడు. ఇక 6,7 స్థానాల్లో హార్దిక్ పాండ్యా. రవీంద్ర జడేజా యాజ్ యూజువల్ గా ఆడతారు. మరోవైపు పాక్ మ్యాచ్ కోసం బౌలింగ్ లోనూ మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) పిచ్ స్పిన్‌కు అనుకూలం కాబట్టి భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతుందని చెబుతున్నారు. అలా అయితే శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో ఆర్ . అశ్విన్ వస్తాడు. మరోవైపు అఫ్ఘాన్ మ్యాచ్ లో ఫెయిల్ అయిన సిరాజ్ ను కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది. ఆ ప్లేస్ లో మ్‌మద్ షమీని ఆడిస్తారని సమాచారం.

Also Read: భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్ బుకింగ్

Advertisment
తాజా కథనాలు