తక్కువ వ్యాయామం చేసినా.. మంచి ఫలితాలొస్తాయంటున్న పరిశోధకులు

ఆరోగ్యంగా, ఫిట్‌నెస్‌గా ఉండటం కోసం, బరువు తగ్గడం కోసం చాలామంది ఎక్కువగా వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదని కొంచెం చేసినా కూడా ఫలితాలు కనిపిస్తాయని తమ పరిశోధనల్లో వెల్లడైందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Health Tips : ఒక్కో అడుగు ఆరోగ్యానికి ముందడుగు.. రోజుకు కనీసం ఎన్ని అడుగులు వేయాలంటే!
New Update

చాలామంది బరువు తగ్గడం కోసం, ఫిట్‌నెస్‌,ఆరోగ్యం కోసం వర్క్‌ఔట్‌లు చేస్తుంటారు. వాకింగ్‌లు, జాగింగ్‌లు, వ్యాయమాలు ఇలా తెగ చేసేస్తుంటారు. అయితే తాజాగా ఓ పరిశోధనల్లో ఇందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. శాస్త్రవేత్తలు కూడా కొంచెం వ్యాయామం చేసిన సరిపోతుందని వెల్లడించారు. మొన్నటిదాకా రోజుకు పది వేల అడుగులు వేస్తే బరువు తగ్గుతారు అని అనుకున్నారు. కానీ అన్ని అడుగులు కూడా అవసరం లేదని తమ పరిశోధనల్లో తెలిసిందంటూ చెప్పారు. ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్పెయిన్‌లోని గ్రెనడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం..తక్కువ వ్యాయామం చేసినా.. మంచి ఫలితాలని పొందొచ్చని.. అది ప్రభావంతంగా కూడా ఉంటుందని పరిశోధనలో తెలిసింది.

Also Read: ఈ తెల్లటి పువ్వులతో…హైబీపీ ఈజీగా తగ్గిపోతుంది..!!

అలాగే వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా దాదాపు 60 శాతం తగ్గుతుందని వెల్లడైంది. ఈ విషయాలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో శాస్త్రవేత్తలు వివరించారు. ఇందుకోసం సుమారు లక్ష​ మందికి పైగా వ్యక్తులపై పరిశోధనలు చేశామని చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా 10 వేల అడుగులు అవసరమని చెబుతారు. అయితే ఇప్పుడు అన్ని అడుగులు అవసరం లేదని చెబుతున్నారు. కేవలం 2700 అడుగులు.. అంటే ఓ రెండు కిలోమీటర్లు నడిచినా కూడా వివిధ గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఎక్కువగా నడిచిన వారిలో కూడా మంచి ఫలితాలే కనిపించాయి. కానీ కొందరు ఎక్కువ నడిస్తే మంచిదనుకొని బలవంతంగా నడుస్తుంటారు. కానీ అదంతా అవసరం లేదని.. రోజుకు 2 కి.మీ నడవండని, మంచి తృణ ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే చాలని వీటివల్ల చాలా రుగ్మతల నుంచి బయటపడతారని అంటున్నారు పరిశోధకులు.

Also Read: చలికాలంలో వచ్చే రోగాలను తరిమేయాలా..? అయితే ఇవి తినండి..!

అలాగే మగవాళ్లకు, ఆడవాళ్లకు వ్యాయామం ఎంత చేయాలనే వ్యత్యాసం ఉండదని పరిశోధనల్లో తేలినట్లు చెప్పారు. తక్కువగా వ్యాయామం చేసిన మంచి ఫలితాలు వస్తాయని..భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అలాగే.. అదే సమయంలో ఎక్కువగా చేసేవారికి కూడా ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉండటంతో పాటు..మరిన్ని ప్రయోజనాలు ఉండటాన్ని కూడా గుర్తించినట్లు తెలిపారు. వాస్తవానికి 10 వేల అడుగులు నడవడం అనేది జపాన్ నుంచి వచ్చిందని.. టోక్యో ఒలంపిక్స్ నేపథ్యంలో ఆటగాళ్లు మెరుగ్గా ఆడేలా ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారించేందుకు జపాన్ ఇలా 10 వేల అడుగుల లక్ష్యాన్ని పెట్టుకుందని తెలిపారు. కానీ శాస్త్రీయంగా ఇది ఎక్కడా కూడా నిరూపితం కాలేదన్నారు. కేవలం ఈ నెంబర్ ఫిగర్‌ను అందరూ గుర్తుంచుకోవాలని ఇలా పెట్టినట్లు తెలిపారు. అందుకే ప్రతిరోజూ తక్కువ వ్యాయామం సుమారు రెండు కి.మీ నడిచిన కూడా ఫిట్‌నెస్‌గా ఉండగలమని చెబుతున్నారు. అలాగే సమయానికి తినడం, కంటి నిండ నిద్రపోవడం లాంటివి చేస్తే జీర్ణ వ్యవస్థ బాగుంటోందని.. ఇతర సమస్యలు కూడా రావడం లేదని పరిశోధకులు చెబుతున్నారు.

#jogging #walking #excercise #health-tips #health-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe