Winter Foods: చలికాలంలో వచ్చే రోగాలను తరిమేయాలా..? అయితే ఇవి తినండి..! చలికాలం వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా చాలా మందిలో దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహరంతో పాటు విటమిన్ C ఎక్కువగా ఉండే పాలకూర, బీట్ రూట్, ముల్లంగి, క్యారెట్, తప్పక తీసుకోవాలి. By Archana 04 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Winter Foods: చలికాలం వచ్చిందంటే వాతావరణ మార్పుల కారణంగా.. జలుబు, దగ్గు, జ్వరం ఇలా పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన శరీరం రోగాల బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకని రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. వీటిలో ముఖ్యంగా విటమిన్ C ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి. దాని వాళ్ళ రోగ నిరోధక శక్తి పెరిగి.. శరీరం వ్యాధుల నుంచి పోరాడే శక్తి వస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు.. పాలకూర పాలకూరలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్స్ నుంచి పోరాడడానికి సహాయపడుతుంది. అంతే కాదు దీనిలో రక్త కణాల ఉత్త్పతికి అవసరమయ్యే ఐరన్ శాతం ఎక్కువ దాని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అందుకని చలికాలంలో ఈ ఆకుకూర మీ ఆహారంలో తప్పక ఉండేలా చూడండి. బ్రోకలీ ఈ కూరగాయలో అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ A, C, E, తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడి శరీరం రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. క్యారెట్ క్యారెట్.. ఇది కంటి ఆరోగ్యంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. క్యారెట్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండును. ఈ బీటా కెరోటిన్ మన శరీరానికి విటమిన్ A రూపంలో అందుతుంది. విటమిన్ ఏ చర్మ ఆరోగ్యాన్ని కాపాడును. దీనిలోని పోషకాలు రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంతో పాటు వ్యాధుల నుంచి పోరాడడానికి సహాయపడతాయి. ముల్లంగి ముల్లంగి.. దీనిలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు రోగ నిరోధక శక్తిని పెంచి శరీరం ఇన్ఫెక్షన్స్, వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ఈ ముల్లంగిని తినడం ఇష్టంలేని వాళ్ళు దీనిని స్నాక్స్ రూపంలో అయిన తీసుకునే ప్రయత్నం చేయండి. బీట్ రూట్ బీట్ రూట్.. ఈ కూరగాయ చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతే కాదు దీనిలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీ బాడీస్, వైట్ బ్లడ్ సెల్స్ ఉత్త్పత్తికి తోడ్పడతాయి. యాంటీ బాడీస్ బయట నుంచే శరీరంలోకి వచ్చే క్రిములు, వైరస్ పై పోరాడి.. రోగాల బారిన పడకుండా కాపాడతాయి. Also Read: Health benefits: పండు మిర్చి..పచ్చి మిర్చిలో ఏది మంచిది..? #life-style #immune-boosting-foods #winter-foods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి