Bangladesh: విద్యార్ధుల నిరసనతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్‌లో విద్యార్ధులు ఆందోళనలకు దిగుతున్నారు. రోడ్లమీదకు వచ్చి గొడవ పెడుతున్నారు. హాస్టళ్ళపై దాడులు, బస్సులను తగులబెట్టడం లాంటివి చేస్తున్నారు.

New Update
Bangladesh: విద్యార్ధుల నిరసనతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌ అట్టుడికిపోతోంది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు.. టైర్లు తగలబెడుతున్నారు.. ఢాకా ఓల్డ్ పల్టాన్‌లో నేషనల్ ప్రెస్ క్లబ్ ముందు రెండు బస్సులకు నిప్పు పెట్టారు. పలు కాలేజీ హాస్టళ్లపై దాడులు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వీధికెక్కుతున్నారు. ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండు చేస్తూ బంగ్లాదేశ్‌లోని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

నిరసనకారులతో అధికార అవామీ లీగ్‌ పార్టీ విద్యార్థి సంఘాల నేతలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు చనిపోయారు. 100 మందికిపైగా గాయపడ్డారు. గొడవల కారణంగా బంగ్లాదేశ్‌లోని అన్ని నగరాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించి.. ప్రతిభకు పట్టం కట్టాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ప్రస్తుత విధానం ప్రకారం.. 1971లో బంగ్లాదేశ్‌ విముక్త పోరాటంలో అసువులు బాసిన వారి పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకు 30శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 10శాతం స్థానిక పరిపాలన జిల్లాల వారికి, 10శాతం మహిళలకు, 5శాతం మైనారిటీ తెగల వారికి, 1 శాతం దివ్యాంగులకు ఇస్తున్నారు. దీన్ని మార్చాలన్న డిమాండ్‌ ఎంతో కాలంగా వినిపిస్తోంది.

Also Read:USA: ట్రంప్ హత్యాయత్నం వెనుక ఇరాన్ హస్తముందా?

Advertisment
Advertisment
తాజా కథనాలు