దేశీయ మార్కెట్లో వరుస లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగియడంతో బారత స్టాక్ మార్కెట్ ఈరోజు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 69,333 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 84 పాయింట్లు కుంగి 20,853 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.36 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, విప్రో, టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Also read:నగరానికి విచ్చేసిన సోనియా, రాహుల్, ప్రియాంక..ఆహ్వానం పలికిన రేవంత్
దేశీ మార్కెట్ తో పాటూ ఆసియా మార్కెట్లు సైతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికాలో నవంబర్ లో అంచనా వేసిదానికంటే ఉద్యోగాలు, వేతనాల పెరుగుదల తగ్గినట్లు డేటా వెలువడింది. మరోవైపు చమురు ధరలు క్షీణించాయి. యూఎస్ బాండ్ ఈల్డ్‌లు తగ్గుతున్నాయి. ఇండియా బీడీపీ వృద్ధిరేటు మెరుగుపడుతోందనే సంకేతాలు వస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుతోంది. క్రూడ్ ధర క్రమంగా క్షీణించడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూలాంశం.
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్..
చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు రూ. 410 వరకు తులం పై తగ్గింది. ఇవాళ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670కి దిగి వచ్చింది. ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులే బంగారం ధరపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇక వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై ఏకంగా రూ. 300 వరకు తగ్గి రూ.81,000 గా నమోదు అయింది.