Stock Markets : మొదలైన కొత్త ఆర్ధిక సంవత్సరం.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు ఏప్రిల్ 1 అంటే ఈరోజు కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైంది. ఈ నేపథ్యంలో దేశీ మార్కెట్ సూచీలు కూడా భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 536 పాయింట్లు లాభపడి 74,188 వద్ద ..నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 22,495 దగ్గర కొనసాగుతున్నాయి. By Manogna alamuru 01 Apr 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Desi Share Markets : దేశీ స్టాక్ మార్కెట్లు మంచి ఉత్సాహం మీద ఉన్నాయి. రెండు రోజుల గ్యాప్ తరువాత సోమరవారం మార్కెట్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. అందులోని కొత్త ఆర్ధిక సంవత్సరం(New Financial Year) ఈరోజు నుంచే మొదలవుతోంది. ఈ ఉత్సాహం దేశీ మార్కెట్లలోనూ కనిపిస్తోంది. ఈరోజు షేర్ మార్కెట్లు మొదలవడమే భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు దేశీ మార్కెట్ల(Desi Markets) కు ఊపునిచ్చాయి. దీంతో ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్(Sensex) 536 పాయింట్లు లాభపడి 74,188 ఉండగా.. నిఫ్టీ(Nifty) 168 పాయింట్లు పెరిగి 22,495 దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు అమెరికా మార్కెట్ సూచీలు కూడా గత వారాన్ని స్వల్ప లాబాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 87.31 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా..అమెరికా డాలర్ ఇండెక్స్ 104.45 పాయింట్ల వద్దకు చేరింది. ప్రస్తుతం రూపాయి విలువ రూ.83.378 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక సెన్సెక్స్ సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. గత వారం దేశీ సంస్థాగత మదుపర్లు రూ.2,691.52 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు. ఇక ఈ వారం మదుపర్లు మార్చి వాహన విక్రయాలు, జీఎస్‌టీ వసూళ్లు, పీఎంఐ గణాంకాలపై దృష్టి పెట్టొచ్చు. మరోవైపు ఏప్రిల్ 3-5 తేదీల్లో జరగనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశం మార్కెట్ల వృద్ధికి కీలకం కానుంది. అయితే ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్వల్పంగా తగ్గిన బంగారం.. మరోవైపు ఈరోజు బంగారం కూడా కాస్త ఊరట కలిగిస్తోంది. వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన బంగారం ధరలు నిన్న తులం రేటు రూ.250 మేర పడిపోయింది. ఇప్పుడు ఈరోజు కూడా అదే రేటును కొనసాగిస్తోంది. ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇది పసిడి ప్రియులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. మరోసారి పెరగక ముందే కొనుగోలు చేయడం మంచిది. ప్రస్తుతం హైదరాబాద్(Hyderabad) లో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు 62 ,900రూ ధర ఉండగా... 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు ఏ మార్పు లేకుండా రూ.68,600 దగ్గర ఉంది. ఇక వెండి హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.78 వేల వద్ద ట్రేడింగ్ అవుతోంది. Also Read : Telangana : ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్..మిగిలిన నాలుగు స్థానాల ఎంపీ అభ్యర్ధలు ప్రకటించే అవకాశం? #nifty-record #sensex-today #stock-markets #financial-year మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి