Why Stock Market is Down Today: వరుసగా పై పైకి కదిలిన స్టాక్ మార్కెట్ ఒక్కసారే భారీగా పతనం అయింది. ఈ రోజు అంటే జనవరి 23న స్టాక్ మార్కెట్‌లో క్షీణత కనిపించింది. సెన్సెక్స్ (Sensex) 1,053 పాయింట్ల పతనంతో 70,370 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) కూడా 333 పాయింట్లు పతనమైంది. 21,238 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, మెటల్ షేర్లలో ఈరోజు మరింత క్షీణత నమోదైంది.
జీ-సోనీ (Zee-Sony) విలీన ఒప్పందం రద్దు తర్వాత, జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు ఈరోజు 30% పడిపోయాయి. రూ.70.50 (30.47%) పతనంతో రూ.160.90 వద్ద ముగిసింది.
మార్కెట్ పతనానికి 3 ప్రధాన కారణాలు
- హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (HDFC Bank) షేర్లు 3.45 శాతం పడిపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో దీని వెయిటేజీ ఎక్కువగా ఉంది. దీని కారణంగా మార్కెట్ క్షీణతకు ఇది గణనీయంగా దోహదపడింది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2 శాతం పడిపోయాయి. బ్రోకరేజ్ సంస్థ సిటీ స్టాక్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. దీంతో మార్కెట్‌కు కూడా బ్రేక్ పడింది.
- విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఈ నెలలో ఇప్పటివరకు రూ.13 వేల కోట్లను విక్రయించారు. దీంతో మార్కెట్ నష్టాలను చవిచూసింది.
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద స్టాక్ మార్కెట్.
భారత (India) స్టాక్ మార్కెట్ ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా (World's fourth-largest Stock Market) మారింది. హాంకాంగ్ స్టాక్ మార్కెట్‌ను వెనక్కు నెట్టి భారత్ ఈ స్థానాన్ని సాధించింది. బ్లూమ్‌బెర్గ్ సేకరించిన సమాచారం ప్రకారం, హాంకాంగ్ స్టాక్ మార్కెట్‌లో జాబితా చేయబడిన షేర్ల మొత్తం విలువ $ 4.29 ట్రిలియన్లు కాగా, భారతీయ స్టాక్ మార్కెట్‌లో జాబితా చేయబడిన షేర్ల మొత్తం మార్కెట్ క్యాప్ $ 4.33 ట్రిలియన్లకు చేరుకుంది.
గతేడాది స్టాక్ మార్కెట్ 4 లక్షల కోట్ల డాలర్లు దాటింది
- మే 2007లో, BSE లిస్టెడ్ కంపెనీలు $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ మైలురాయిని సాధించాయి.
- రెట్టింపు కావడానికి 10 ఏళ్లు పట్టింది. జూలై 2017లో మార్కెట్ క్యాప్ 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
- మే 2021లో మార్కెట్ క్యాప్ $3 ట్రిలియన్లకు చేరుకుంది.
- నవంబర్ 29న 4 లక్షల కోట్ల డాలర్లు దాటింది
Also Read: అయోధ్య వెళ్ళాలా.. ట్రైన్ ఏసీ టికెట్ ధరకే.. విమానం టికెట్.. లేటెందుకు?
శనివారం మార్కెట్‌లో పెరుగుదల ఉంది..
అంతకుముందు జనవరి 20న స్టాక్ మార్కెట్‌లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 321 పాయింట్లు పెరిగి 71,508 వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ కూడా123 పాయింట్లు పెరిగింది. 21,585 వద్ద ముగిసింది. మంచి త్రైమాసిక ఫలితాల తర్వాత, IDBI బ్యాంక్ షేర్లు 13% లాభపడ్డాయి.
Watch this interesting Video: