/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ssc-exams-gd-jpg.webp)
SSC Selection Post Recruitment 2024: కేంద్రంలో ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం చేయడమే మీ లక్ష్యం అయితే...మీకు గుడ్ న్యూస్ చెప్పింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కేంద్రప్రభుత్వంలోని పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ శాఖాల్లో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 2,049 పోస్టులకు గాను అర్హులైన వారి నుంచి ఆన్ లైన్లో htt://ssc.gov.in/ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పది, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొంది
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
నోటిఫికేషన్ లో ఉన్న ముఖ్య అంశాలను ఓ సారి పరిశీలిస్తే:
-ఫిబ్రవరి 26 నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ మార్చి 18 వరకు కొనసాగుతుందని తెలిపింది. దరఖాస్తులు ఆన్ లైన్ చేసుకోవాలి. ఫీజు చెల్లింపు గడువు మార్చి 19 వరకు ఉంది. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే సవరించుకునేందుకు మార్చి 22 నుంచి 24 వరకు అవకాశం కల్పించింది.
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 30ఏళ్ల లోపు ఉండాలి. కేటగిరీల వారీగా వయె సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు ఎక్స్ సర్వీస్ మెన్ లకు మూడేల్లు, దివ్యాంగులకు పదేళ్లు ఉంటుంది.
-దరఖాస్తు రుసుము జనరల్ , ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 100కాగా ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులు, మహిళలు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి చెందిన వారికి మినహాయింపు ఉంటుంది.
-కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకు సెలక్ట్ చేస్తారు. మే 6 నుంచి 8 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయి. తప్పు సమాధానానికి హాఫ్ మార్కు కట్ చేస్తారు. ఉద్యోగ హోదాలను జీతభత్యాలు ఉంటాయి.మరింత సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.