కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సం....ఇలా అన్నీ వరుసగా కుటుంబ కథా చిత్రాలే తీశారు శ్రీకాంత్ అడ్డాల. అయితే బ్రహ్మోత్సవం అట్టర్ ఫ్లాప్ తర్వాత ఆయన తన పంథాను మార్చుకున్నారు. వెంకటేష్ తో నారప్ప సినిమా చేశారు. కానీ అది రీమేక్ కావడంతో పెద్దగా నోటెడ్ అవలేదు. అందుకే ఈసారి శ్రీకాంత్ అడ్డాల పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. పెద కాపు సినిమాతో ఫుల్ యాక్షన్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అందులో ఎప్పుడూ లేనిది ఇలాంటి జోనర్ లో సినిమా ఎందుకు తీశారు అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ శ్రీకాంత్ బ్రహ్మోత్సవం గురించి కూడా చెప్పుకొచ్చారు. అలాంటి మూవీలు చేస్తే ప్రేక్షకులు మాట వినడం లేదనే కదా, ఆ ఫ్రస్ట్రేషన్ తోనే పెదకాపు సినిమా తీశావు కదా అని సునీల్ కూడా అడిగారని చెప్పారు. అయితే తాను ఇలాంటి సినిమా తీయడానికి రీజన్ అది కాదని....ఏ సినిమా తీస్తే జనాలకు నచ్చుతుంది అనేది ఎప్పటికీ తెలియదని అన్నారు శ్రీకాంత్. అన్ని సినిమాలను మిట్టు కావాలనే తీస్తామని...ఒక్కోసారి ఫలితం అనుకున్నట్టుగా రాదని చెప్పారు. బ్రహ్మోత్సవం మూవీలో మహేష్ బాబు, కాజల్, సమంత లాంటి పెద్ద పెద్ద స్టార్లు నటించారు. కానీ ప్లాప్ అయింది. పెదకాపు సినిమా సబ్జెక్ట్ తనకు నచ్చి తీశానని చెప్పారు శ్రీకాంత్ అడ్డాల.
పెదకాపు సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించడమే కాకుండా మొదటిసారి నటించారు కూడా. అది కూడా విలన్ పాత్రలో. ఇక ఈ సినిమాలో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ హీరోహీరోయిన్లగా డెబ్యూ ఇస్తున్నారు. అనసూయ, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.