నేడు కాంస్యం కోసం స్పెయిన్, భారత్ హాకీ జట్ల సమరం!
ఒలింపిక్ హాకీ కాంస్య పతక పోరులో నేడు భారత జట్టు, స్పెయిన్ తో తలపడనుంది.సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓటమి పాలై 44 ఏళ్ల తర్వాత భారత్ ఫైనల్‌కు వెళ్లే అవకాశం చేజార్చుకుంది.
ఒలింపిక్ హాకీ కాంస్య పతక పోరులో నేడు భారత జట్టు, స్పెయిన్ తో తలపడనుంది.సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓటమి పాలై 44 ఏళ్ల తర్వాత భారత్ ఫైనల్‌కు వెళ్లే అవకాశం చేజార్చుకుంది.
పారిస్ ఒలింపిక్స్ లో ఈరోజు అంటే ఆగస్టు 8న నాలుగు మెడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో గోల్డ్ కోసం, కాంస్య పతకం కోసం హాకీ టీమ్, రెజ్లింగ్ లో అన్షు మాలిక్, అమన్ సెహ్రావత్ మెడల్స్ కోసం పోటీలో ఉన్నారు. ఈ పోటీల షెడ్యూల్ ఆర్టికల్ లో చూడవచ్చు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్..ఫైనల్ కు ముందు ఆమె పై అనర్హత వేటు పడటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.టాలీవుడ్ నుంచి ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు కూడా వినేశ్‌కు అండగా నిలిచారు. పతకం ముఖ్యం కాదని, మీరు నిజమైన ఛాంపియన్ అని పేర్కొన్నారు.
వినేశ్ ఫోగట్‌ను పతక విజేతగా స్వాగతిస్తామని, సత్కరిస్తామని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు. ఒలింపిక్స్‌లో రజత పతక విజేతకు హర్యానా ప్రభుత్వం అందించే అన్ని సన్మానాలు, రివార్డులు, సకల సౌకర్యాలను వినేశ్ కి కూడా అందజేస్తామని ముఖ్యమంత్రి వివరించారు.
ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లరకు కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. వినేశ్ ఫోగట్ అనర్హత తర్వాత.. ఒలింపిక్ విలేజ్‌కు భారత రెజ్లర్ యాంటిమ్ పంఘల్ అక్రడిటేషన్ ని కూడా ఐఓఏ రద్దు చేసింది. వెంటనే పారిస్ వదిలి వెళ్ళమని నిర్వహకులు ఆదేశించారు.
ఒలింపిక్స్ నుంచి అనర్హతకు గురయిన వినేశ్ ఫోగాట్..తన కెరియర్‌కు గుడ్‌బై చెప్పేసింది.ఇంక పోరాడలేను అంటూ తన తల్లికి క్షమాపణలు చెప్పింది. వినేశ్ ఆటలో ఓడిపోయి ఉండొచ్చు..దూరమయీ ఉండొచ్చు.కానీ ఆమె కోట్లమంది భారతీయుల్లో స్ఫూర్తిని నింపింది. వాళ్ళ మనసుల్లో విజేతగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది.
రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రెజ్లింగ్ కి గురువారం వీడ్కోలు పలికింది. నా పై రెజ్లింగ్ నే గెలిచింది, అమ్మా..నేను ఓడిపోయాను, క్షమించండి, మీ కల, నా ధైర్యం, ప్రతిదీ విచ్ఛిన్నమైంది. కుస్తీకి గుడ్‌బై 2001-2024..అంటూ పేర్కొంటూ వినేశ్ ట్విటర్ లో ఓ పోస్ట్ పెట్టింది..
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు పడడం గురించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నో ! నో! నో! .. ఇది ఓ పీడకల అయితే బాగుండు..’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు.
ఒలింపిక్స్‌లో ఫైనల్ పోరుకు ముందు రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అనర్హతకు గురైంది. వంద గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేశారు. దీని మీద వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)ను ఆశ్రయించింది.