Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం యావత్ భారత్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన ఫొగాట్.. ఈవెంట్‌కు ముందు బరువు కొలవగా కేవలం 100 గ్రాములు అధికంగా ఉండటంతో నిర్వాహకులు ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు. బరువు తగ్గేందుకు ఆమె ఎంతగానో ప్రయత్నించినా ఫలితం చేజారిపోయింది. జరిగిన దానిని వినేశ్ చాలా ధైర్యం తీసుకుంది. ఇదంతా ఆటలో భాగం అని…దానికి ఎవరు ఏం చేస్తారు అంటూ మిగతా ఆటగాళ్ళకు, కోచ్‌లకు చెప్పింది. నవ్వుతూ తనను తాను, మిగతా వారిని ఓదార్చింది. దాంతో పాటూ తర్వాత వేయాల్సిన కరెక్ట్ స్టెప్‌ను వేసింది.
పూర్తిగా చదవండి..Vinesh Phogat: అనర్హత మీద స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టుకు వినేశ్
ఒలింపిక్స్‌లో ఫైనల్ పోరుకు ముందు రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అనర్హతకు గురైంది. వంద గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు. దీని మీద వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)ను ఆశ్రయించింది.
Translate this News: