Vinesh Phogat: కావాలనే తొక్కేశారు.. కానీ గెలుపు ఆమెదే.. వినేశ్ ఓ సంచలనం ఒలింపిక్స్ నుంచి అనర్హతకు గురయిన వినేశ్ ఫోగాట్..తన కెరియర్‌కు గుడ్‌బై చెప్పేసింది.ఇంక పోరాడలేను అంటూ తన తల్లికి క్షమాపణలు చెప్పింది. వినేశ్ ఆటలో ఓడిపోయి ఉండొచ్చు..దూరమయీ ఉండొచ్చు.కానీ ఆమె కోట్లమంది భారతీయుల్లో స్ఫూర్తిని నింపింది. వాళ్ళ మనసుల్లో విజేతగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. By Manogna alamuru 08 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Vinesh Phogat - A True Sensation: ప్రస్తుతం ఇండియాలో హాట్ టాపిక్ వినేశ్ ఫోగాట్. రెండు రోజులుగా ఈమె చుట్టూరానే అన్ని వార్తలు. ఒలింపిక్స్‌లో (Paris Olympics 2024) సెమీస్‌లో గెలిచి ఫైనల్స్‌కు వెళ్ళిన మొట్టమొదటి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది వినేశ్. కానీ ఒక్క రోజులోనే అన్నీ తారుమారు అయిపోయాయి. పతకం మాట అటుంచి కనీసం ఒలింపిక్స్‌లో కూడా లేకుండా చేశారు. 100 గ్రాముల బరువు అధికంగా ఉందంటూ ఆమెపై అనర్హత వేటు వేశారు. ఇందులో వినేశ్ తప్పు ఏమీ లేదు. ఎవరో చేసిన తప్పుకు ఆమె బలైపోయింది. ఆమె చుట్టూ ఉన్నవారే ఆమెకు గోతులు తీశారు. వినేశ్ ను పోటీకి సిద్ధం చేయాల్సిన డాక్టర్లు, కోచ్, న్యూట్రిషియన్లు ఆమె బరువు పెరగడానికి కారణం అయ్యారు. సెమీస్‌కు ముందు 49.9 కేజీల ఉన్న వినేశ్ ఒక్క రాత్రిలో రెండు కేజీలు పెరిగిపోయింది. న్యూట్రిషియన్, డాక్టర్ ఆమెకు కేవలం మంచినీరు మాత్రమే ఇచ్చాము అని చెబుతున్నారు. రాత్రంతా ఆమెకు నీరు ఇవ్వలేదు. ఎక్సర్సైజ్ చేయించారు. అయినా కూడా ఆమె తగ్గలేకపోయింది. అయితే ఆటగాళ్ళ బాడీ తీరు ఎలాంటిది...పోటీకి ముందు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎంత నీరు ఇవ్వాలి అన్నవి న్యూట్రిషియన, డాక్టర్, కోచ్ చూసుకుంటారు. ఈ విషయంలో ఆటగాళ్ళకు ఏమీ సంబంధం ఉండదు. వాళ్ళు ఎలా చెబితే అలా చేస్తారు. వినేశ్ కూడా అదే చేసింది. దాంతో వాళ్ళు చేసిన తప్పుకు వినేశ్ బలైపోయింది. కోచ్, న్యూట్రిషన్, డాక్టర్ వీళ్ళందరూ ఇలాంటి విషయాల్లో ఎంతో అనుభవం కలిగి ఉంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తుంటారు అలాంటిది వాళ్ళకు ఈ విషయం ముందే తెలియదు అంటే ఎంత మాత్రం నమ్మదగింది కాదు. అలాగే ఒలింపిక్స్‌కు ముందు నుంచీ వీళ్ళందరూ అథ్లెట్స్ తో ఇంట్రాక్షన్‌లోనే ఉంటారు. ఆమెను దగ్గరుండి ట్రైన్ చేస్తారు. అంతా తెలుసుకుంటారు. అలాంటప్పుడు వినేశ్ బాడీ తీరు గురించి వాళ్ళకు క్షుణ్ణంగా ముందే తెలిసి ఉంటుంది. అయినా కూడా ఆమె విషయంలో తప్పు చేశారంటే ఎక్కడో తేడా కొడుతోంది. ఇదంతా కావాలనే చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు చేశారు, ఎవరు చేయమని చెప్పారు అన్నదే తెలియాల్సి ఉంది. ఎవరికి వారే తప్పించుకుటున్నారు... వినేశ్ ఫోగాట్ విషయంలో జరిగిన తప్పును ఎంతో జాగ్రత్తగా కప్పిపుచ్చుకుంటున్నారు ఆమె టీమ్. ఒకరి మీద ఒకరు తోసుకుంటూ...చూసుకోలేదు అంటూ మెల్లగా జారుకుంటున్నారు. ఇప్పటివరకు దీని మీద ఎవరూ యాక్షన్ తీసుకున్నట్టు కూడా కనిపించలేదు. కనీసం దానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడడం లేదు. ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ అండగా ఉంటామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వినేశ్ వ్యవహారం మీద న్యాయపరంగా ముందుకు వెళతామని సంజయ్ సింగ్ చేప్పారు. బానే ఉంది కానీ..మహా అయితే ఏం చేస్తారు? కోచ్, న్యూట్రిషనిస్ట్, సహాయక సిబ్బందిని తీసేస్తారు. వారికి జరిమానాల్లాంటివి వేస్తారు. అంతకు మించి ఏమీ జరగదు. కానీ కెరీర్‌లోనే చిరస్మరణీయమవుతుందని భావించిన రోజు.. పీడకలను మిగిల్చింది. ఆమెకిది తీరని బాధ.. జీవితకాలం వెంటాడే వ్యథ. ఆ ఎక్కువున్న బరువును తగ్గించుకోవడానికి ఆమె ఎంత చేసిందని! తిండి మానేసింది, నీళ్లూ ముట్టలేదు, జుత్తునూ కత్తిరించుకుంది, రాత్రంతా మెలకువతోనే ఉంది. అయినా ఫలితం లేకపోయింది. ఆమె గుండె ఆగిపోయింది. ఈ బాధను వినేశ్ ఎలా భరిస్తోందో ఊహించుకోవడమే కష్టం. పోటీల రోజు బరువు జాగ్రత్తగా చూసుకోకపవడంలో జరిగిన చిన్న నిర్లక్ష్యం ఆమెకు జీవిత కాల వేదనను మిగిల్చింది. దీని నుంచి ఆమె కోలుకోలేక పోతోంది. అందుకే తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. తన తల్లికి క్షమాపణ చెపుతూ..రెజ్లింగ్ నాపై విజయం సాధించింది. నేను ఓడిపోయాను. నా కలలు, ధైర్యం బద్ధలయిపోయాయి. ఇక నాలో ఏ మాత్రం శక్తి లేదు అంటూ శాశ్వతంగా గుడ్ బై చెప్పేసింది. దీని నుంచి ఆమె ఎప్పుడు కోలుకుంటుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది.ఈమె ఈ కష్టానికి బాధ్యులు ఎవరు? పొగడని నోళ్ళు..జాలిని చూపిస్తున్నాయి.. ఈ మొత్తం వ్యవహారం నిశితంగా పరిశీలించిన వారికి ఎవరికి అయినా అనుమానం రాకుండా ఉండదు. దానికి తోడు ఆమె సెమీస్ గెలిచి ఫైనల్స్‌కు వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా స్పందిచలేదు. ప్రభుత్వం నుంచి కానీ మరే ఇతర పెద్దల దగ్గర నుంచి కానీ అప్రిసియేషన్ లేదు. కానీ వినేశ్ అనర్హత గురయింది అని తెలియగానే మాత్రం కుప్పలు తెప్పలుగా వచ్చి జాలిని చూపిస్తున్నారు. దీంతో ఈ ఆమెకు జరిగిన అన్యాయం మీద అనుమానాలు మరింత బలమయ్యాయి. మహిళా రెజర్ల మీద లైగింకవేధింపులు ఆరోపణలతో ఒకప్పటి బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మీద వినేశ్ ఫోగాట్ అలుపెరుగని పోరాటం చేసింది. ఆ సమయంలో ఆమెకు చాలా కొద్ది మంది మాత్రమే సపోర్ట్‌గా నిలిచారు. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయలేదు. అన్యాయాన్ని ఎదిరించేందుకు తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఖేల్ రత్న అవార్డును (Khel Ratna Award) కూడా వెనక్కు తిరిగి ఇచ్చేసింది. సాధించిన పతకాలన్నీ గంగానదిలో విసిరేస్తానని చెప్పింది. అయినా రెజర్లకు న్యాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దానికి తోడు వినేశ్ కెరీర్ ఖతం అయిపోయిందని అన్నారు. ఇలాంటి విషయాలపై దృష్టి పెడితే నీకే తలపోట్లు.. అంటూ విద్వేషకారులు విషం చిమ్ముతున్నా.. ఆమె వెనుకడుగు వేయలేదు. అన్యాయం చేసినవాళ్ళు కాలరెగరేసుకుని దర్జాగా తిరుగుతుంటే ఆవేశంతో రగలిపోయింది. తరువాత ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే క్రమంలో.. జూనియర్ చేతిలో ఓడితే ఇక నీ ఆట ఖతం అంటూ అవహేళన చేశారు. కన్నీళ్ళు పెట్టుకుంది. కానీ తనలోనే ఆవేశాన్ని మాత్రం చంపుకోలేదు. కష్టపడి ఒలింపిక్స్‌కు అర్హత సాధించి..ఫైనల్స్ వరకు వెళ్ళింది. ఇదే వినేశ్ అనర్హతకు దారి తీసిందా అని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. తనను అణిచివేయడానికే ఇలా చేశారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనిని ఎవ్వరూ బయటకు మాత్రం అనలేరు. ఒకవేళ ఒకరు ఇద్దరు లేవెత్తినా...తొక్కిపడేస్తారు. కబట్టి ఇది ఎప్పటికీ తీరని అనుమానంగానే మిగిలిపోతుంది తప్ప మరొకటి జరగదు. వినేశ్ ఫోగాట్ జీవితాంతం ఈ బాధను అనుభవిస్తూ బతకాల్సిందే. ఇప్పుడు ఆమె తన ఆటకు గుడ్‌బై కూడా చెప్పేసింది. వాళ్ళు అనుకున్నది పూర్తిగా సాధించారు. ఆమె నిజమైన విజేత.. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోయారు. వినేశ్ ఇక మీదట ఆడినా, ఆడపోయినా...ఆమె గురించి భారత దేశంలో తరతరాలు చెప్పుకుంటారు. వినేశ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పటికే కోట్ల మంది భారతీయులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. తమ మనసుల్లో చెరగని స్థానాన్ని ఇచ్చారు. ఇది చాలదా...వినేశ్ గెలిచింది అని చెప్పడానికి. ఆమె విజేతగా నిలిచిపోవడానికి. Also Read: కుస్తీనే గెలిచింది..నేనే ఓడిపోయా..రెజ్లింగ్ కి గుడ్ బై ..వినేశ్ ఎమోషనల్ పోస్ట్! #paris-olympics-2024 #wrestling #vinesh-phogat #india-at-olympics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి