/rtv/media/media_files/2026/01/06/rehman-2026-01-06-18-53-43.jpg)
బంగ్లాదేశ్ లో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. భారత్ కు వ్యిరేకంగా అక్కడి హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమన్ ఐపీఎల్ పాల్గొనకూడదు అంటూ తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. వారు మన హిందువలపై దాడులు చేస్తుంటే..మనం మాత్రం ఆ దేశ క్రికెటర్లను ఆడించాలా అంటూ సోషల్ మీడియా అంతా గగ్గోలు పెట్టింది. దీంతో అతనిపై బీసీసీఐ వేటు వేసింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మినీవేలంలో కేకేఆర్ అతన్ని రూ.9.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అతన్ని రిలీజ్ చేయమని బీసీసీఐ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఆదేశించింది. దీని వెంటనే బంగ్లాదేశ్ కూడా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తాము భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో భద్రతా కారణాల రీత్యా పాల్గొనలేమని, తమ మ్యాచ్ వేదికలను మరో చోటుకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్.. ఐసీసీకి లేఖ కూడా రాసింది.
ఒక్క రూపాయి కూడా దక్కదు..
ఈ వివాదం అంతా ఇలా ఉంటే.. ఇప్పుడు ముస్తాఫిజుర్ రెహమాన్ కు అసలు డబ్బులు ఇస్తారా లేదా అనే చర్చ మరోవైపు నడుస్తోంది. ఐపీెల్ నిబంధనలు రెహమాన్ కు వర్తిస్తాయా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. నిజానికి బంగ్లాదేశ్ బౌలర్‌కు ఎటువంటి ఆర్థిక పరిహారం లభించే అవకాశం లేదు. క్రికెట్ కు సంబంధం లేని కారణాలతో అతను తొలగడంతో పరిహారం దక్కదని చెబుతున్నారు. మామూలుగా ఐపీఎల్ ఆటగాళ్లు పొందే మొత్తాల మీద బీమా ఉంటుంది. దీని ప్రకారం విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ ముందు ప్రాక్టీస్ శిబిరంలో చేరాక లేదా టోర్నమెంట్ సమయంలో కానీ గాయపడితే వాళ్ళ తాలూకా ఫ్రాంఛైజీ పరిహారం చెల్లిస్తుంది. 50 శాతం వరకు ఫీజును ఇచ్చేస్తారు. కానీ రెహమాన్ ఐపీఎల్ నుంచి తొలగడానికి అసలు అతను కారణమే కాదు. ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయం. అందుకే అతనికి డబ్బులు రావని చెబుతున్నారు. బీమా సంస్థలు సైతం ఒక్క రూపాయి కూడా ఇవ్వవని తెలుస్తోంది. చట్టపరంగా రెహమాన్ ముందుకు వెళితే ఏదైనా దక్కొచ్చు...కానీ ఐపీఎల్ భారత పట్టపరిధిలోకి వస్తుంది. కాబట్టి సీఏఎస్ కూడా బీసీసీఐ కే ఫేవర్ గా ఉంటుంది. సో..మొత్తానికి ముప్తాఫిజుర్ రెహమాన్ కు ఒక్క రూపాయి కూడా దక్కే అవకాశం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Follow Us