/rtv/media/media_files/2025/09/14/asia-cup-2025-09-14-12-04-52.jpg)
What Will Happen If Team India Decides To Boycott Match Against Pakistan?
ఆసియా కప్ 2025 లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాలు క్రికెట్ మ్యాచ్ ఆడనుండటం ఇదే మొదటిసారి. అయితే మ్యాచ్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి దీనిపై వివాదం కొనసాగుతోంది. చాలామంది పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్ ఆడటాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ టీమిండియా పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకపోతే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
Also Read: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం
ప్రస్తుతం ఆసియా కప్ పాయింట్ల పట్టికలో చూసుకుంటే టీమిండియా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో పాకిస్థాన్ ఉంది. ఒకవేళ భారత్ పాక్‌తో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకుంటే ఆ ఆటను భారత్ ఓటమిగా పరిగణిస్తారు. దీంతో ఆ మ్యాచ్ గెలుపు పాయింట్లు పాకిస్థాన్‌కు వెళ్తాయి. తద్వారా పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో భారత్‌ను దాటి మొదటి స్థానంలోకి వెళ్తుంది. సూపర్ 4లో కూడా దాదాపు ఇదే జరుగుతుంది. అప్పుడు ఇరు జట్లు ఫైనల్‌కు వెళ్లి.. ఇండియా మ్యాచ్ ఆడకుంటే పాకిస్థాన్‌నే విజేతగా ప్రకటిస్తారు.
It's time for the 𝘣𝘢𝘢𝘱 𝘰𝘧 𝘢𝘭𝘭 𝘣𝘢𝘵𝘵𝘭𝘦𝘴 ♨️😍
— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025
The clash of the 𝗔𝗥𝗖𝗛 𝗥𝗜𝗩𝗔𝗟𝗦 - #INDvPAK, tonight at 7 PM, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork#DPWorldAsiaCup2025pic.twitter.com/9japlSaGp4
కొన్ని నెలల క్రితం వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ (WCL) జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మాజీ భారత క్రికెటర్లు పాక్‌తో గ్రూప్ స్టేజ్‌లో అలాగే సెమీఫైనల్స్‌లో ఆడేందుకు నిరాకరించారు. ఈ మ్యాచ్‌ను నిషేధించడం వల్ల పాక్ టీమ్ ఫైనల్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. చివరికి సౌత్ ఆఫ్రికా చేతిలో 9 వికెట్ల తేడాతో పాక్ ఓడిపోయింది.
Also Read: కోహ్లీ లేడు, ఇండియాను ఓడించండి.. మిస్బా-ఉల్-హక్ కీలక కామెంట్స్