/rtv/media/media_files/2025/09/13/ind-pak-2025-09-13-21-16-37.jpg)
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ ఇటీవల ఆసియా కప్ మ్యాచ్కు ముందు భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. విరాట్ కోహ్లీ భారత టీ20 జట్టులో లేకపోవడం పాకిస్తాన్ కు ఒక గొప్ప అవకాశమని అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ కు ఇక్కడ ఒక అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు (భారత్) మంచి ఆరంభం లభించక, రెండు వికెట్లు కోల్పోతే, అక్కడ విరాట్ కోహ్లీ లేడు అని మిస్బా అన్నారు.
కోహ్లీ టీ20 ఫార్మాట్ నుండి రిటైర్ అయిన తర్వాత, భారత బ్యాటింగ్ లైనప్ భిన్నంగా ఉందని, కొత్త ఆటగాళ్లకు పాకిస్తాన్ బౌలర్లపై అంతగా అనుభవం లేదని ఆయన పేర్కొన్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు లేకపోవడం వల్ల పాకిస్తాన్ బౌలర్లు మ్యాచ్ ప్రారంభంలోనే వికెట్లు తీసి భారత బ్యాటింగ్ లో ఒక ఖాళీని సృష్టించగలిగితే, విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని మిస్బా-ఉల్-హక్ అభిప్రాయపడ్డారు.
ఏకీభవించని షోయబ్ అక్తర్
అయితే, మరో మాజీ పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ అక్తర్ మాత్రం మిస్బా అభిప్రాయంతో ఏకీభవించలేదు. భారత్ జట్టులో అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్, తిలక్ వర్మ వంటి యువ ప్రతిభావంతులు ఉన్నారని, వారిని అంత తేలికగా తక్కువ అంచనా వేయలేమని అక్తర్ అన్నారు. ఆసియా కప్ లో భారత జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)పై తమ మొదటి మ్యాచ్ లో ఘనవిజయం సాధించి, టోర్నమెంట్ ను అద్భుతంగా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, రాబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పై క్రీడా విశ్లేషకుల్లో ఈ చర్చకు మరింత ప్రాధాన్యత లభించింది.