Boxing: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. ఇందులో జైస్మీన్‌ లాంబోరియా ఛాంపియన్‌గా నిలిచారు. లివర్‌పుల్‌లో మహిళల 57 కిలోల విభాగంలో జరిగిన పోటీలో ఆమె స్వర్ణం సాధించారు.

New Update
boxing

2025 ప్రపంచ బాక్సింగ్ఛాంపియన్‌షిప్స్‌లోజైస్మిన్లంబోరియా భారతదేశానికి తొలి బంగారు పతకాన్ని అందించారు. కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత జైస్మిన్, 57 కిలోల విభాగంలో ఫైనల్‌లో పోలాండ్‌కు చెందిన జూలియాస్జెరెమెటాను ఓడించి ఈమె ఈ పతకాన్ని గెలుచుకున్నారు. అంతకు ముందు 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ జూలియా రజత పతకాన్ని గెలుచుకున్నారు. 

4-1 తేడాతో విజృంభించి..

జైస్మిన్ మొదటి రౌండ్ లో వెనుబడి పోయారు. కానీ రెడవ రౌండ్ లో తిరిగి పుజుకని అక్కడ నుంచి వెనకు తిరిగి చూడలేదు. దీంతో జూలియాను 4-1 తేడాతో ఓడించారు ఒలింపిక్స్ , గ్లోబల్ ఈవెంట్ నుంచి మొదటి రౌండ్లలోనే నిష్క్రమించిన జూలియా ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మాత్రం అద్భుతమైన టతీరును ప్రదర్శించారు. మరోవైపు భారత్‌ తరఫున మీనాక్షి హుడా ( 48 కేజీలు) ఫైనల్ పోరుకు అర్హత సాధించగా..80 కిలోల విభాగంలో పూజా రాణి కాంస్య పతకం సాధించగా, నుపూర్ రజత పతకం గెలుచుకుంది. పురుషుల విభాగంలో భారత్‌ ఒక్క పతకం లేకుండానే పోటీని ముగించింది.

Also Read: India-Pak Match: మోస్ట్ వెయిటెడ్...భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజే

Advertisment
తాజా కథనాలు