/rtv/media/media_files/2025/03/22/wvPUeQq1dSx0Zlb58b7u.jpg)
టీ20 వరల్డ్ కప్ గెలిచాక అంతర్జాతీయ టీ20ల నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లు రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఐపీఎల్ తప్ప వీరు ఏ టీ20 ఆడడం లేదు. అయితే తాము ఈ నిర్ణయం అంత తేలిగ్గా తీసుకోలేదని చెప్పాడు కింగ్ కోహ్లీ. భారత యువ క్రికెట్ర్లకు అవకాశాలు రావాలంటే తమలాంటి సీనియర్లు రిటైర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. భారత క్రికెట్ మరింత అభివృద్ధి చెందడానికి ఇది చాలా అవసరమని అన్నాడు.
యువక్రికెటన్లకు అవకాశం రావాలి..
నెక్ట్స్ టీ20 వరల్డ్ కప్ మరో రెండేళ్ళల్లో ఉంది. దీనిలో అందరూ యువ ఆటగాళ్ళే ఆడతారు. అప్పుడు వాళ్ళు బాగా ఆడాలంటే..ఇప్పటి నుంచే వాళ్ళు అంతర్జాతీయ టీ20లు ఆడాల్సి ఉంటుంది. అలా జరగాలంటే మా సీనియర్స్ యువ ఆటగాళ్ళకు అవకాశం ఇవ్వాలి. అందుకే రోహిత్, తాను, జడేజా అందరం కలిసి నిర్నయం తీసుకుని టీ20ల నుంచి రిటైర్ అయ్యామని విరాట్ చెప్పాడు. సీనియర్లగా అది మా బాధ్యత అని అన్నాడు. టి20 లకు వీడ్కోలు చెప్పినా.. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ లో మాత్రం విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో 10 మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ 138 పైగా స్ట్రైక్ రేటుతో 443 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ లిస్టులో మూడో స్థానంలో కోహ్లీ ఉన్నాడు. ఈ ఐపీఎల్ లో 10 మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ ఆరు హాఫ్ సెంచరీలు సాధించాడు
today-latest-news-in-telugu | virat-kohli | t20
Also Read: GT VS SRH: హైదరాబాద్ కథ ముగిసినట్లే..అదరగొట్టిన గుజరాత్