GT VS SRH: హైదరాబాద్ కథ ముగిసినట్లే..అదరగొట్టిన గుజరాత్

ఏంటో హైదరాబాద్ సన్ రైజర్స్...ఎప్పుడు ఆడుతుందో, ఎప్పుడు ఆడదో...తెలియకుండా ఉంది. చెపాక్ స్టేడియంలో చెన్నైను ఓడించి సంబరాలు చేసుకున్నంతసేపు పట్టలేదు నిన్న గుజరాత్ చేతిలో చిత్తుగా ఓడిపోవడానికి. నిన్న జరిగిన మ్యాచ్ లో గుజరాత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది.

New Update
ipl

GT VS SRH

ఐపీఎల్ లో నిన్న అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో గుజరాత్ అదరగొట్టగా...హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది. ఆర్ఆర్ చేతిలో దెబ్బ తిన్న గుజరాత్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో పుంజుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టి విజయాన్నందుకుంది. పది మ్యాచ్‌లాడి ఏడో విజయం సాధించిన గుజరాత్‌ ప్లేఆఫ్స్‌కు చేరువైంది. హైదరాబాద్ మాత్రం ఇంటికి వెళ్ళడానికి దగ్గరైంది. 

పాపం అభిఫేక్ శర్మ..

నిన్న గుజరాత్, హైదరాబాద్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 6 వికెట్లకు 224 పరుగుల భారీ స్కోరు చేయగా...లక్ష్య ఛేదనలో తడబడింది. 186 పరుగులు చేసి చేతులెత్తేసింది. అభిషేక్ శర్మ 41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్ లతో 74 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మిగతా బ్యాటర్లు వరుసగా విఫలం అవడంతో హైదరాబాద్ కు ఓటమి తప్పలేదు. ట్రావిస్ హెడ్ 20, ఇషాన్ కిషన్ 1, క్లాసెన్ 23, అనికేత్ 3, కమిందు0, కమిన్స్ 19 పరుగులు మాత్రమే చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ (2/19), మహ్మద్‌ సిరాజ్‌ (2/33) ఆ జట్టును దెబ్బ తీశారు.

ఐపీఎల్ 2025వ సీజన్‌లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా మొదటి ఇన్నింగ్ చేస్తున్న GT జట్టు 10 ఓవర్లు పూర్తి చేసుకుంది. ఈ పది ఓవర్లలో 1 వికెట్ల నష్టానికి 120 స్కోర్ చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 23 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో కెప్టెన్ శుభమన్ గిల్, జోష్ బట్లర్ ఉన్నాడు. గిల్ 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. ఈ వార్త రాసే సమయానికి గిల్ (62), బట్లర్ (21) పరుగులతో ఉన్నారు. 

 today-latest-news-in-telugu | srh | match

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు