Virat Kohli: సెంచరీ చేసిన విరాట్‌ కొహ్లీ..

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా పెర్త్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు టీమిండియా 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు.

New Update
kkk

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా పెర్త్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు టీమిండియా 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 172/0తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌ను 487/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ 161 పరుగులతో దంచికొట్టగా.. విరాట్‌ కోహ్లీ కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి విశ్వరూపం చూపించాడు. ఇక కేఎల్‌ రాహుల్ 77 పరుగులు చేశాడు. నితీశ్‌ రెడ్డి 27 బంతుల్లో 38 పరుగులు చేశాడు.     

Also Read: ఆ దేశంలో అధికారుల కంటే ఖైదీల సంపాదనే ఎక్కువ

ఇక ఆసీస్ బౌలర్లలో చూసుకుంటే నాథన్ లైయన్ రెండు, స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్‌, మిచెల్‌ మార్ష్ ఒక్కో వికెట్‌ తీశారు. కొహ్లీ 16 నెలల తర్వాత టెస్టుల్లో సెంచరీ చేయడం విశేషం. ఆస్ట్రేలియాలో అడిన మ్యాచుల్లో కోహ్లీకి ఇది ఏడో సెంచరీ. దీంతో కంగారుల గడ్డపై ఎక్కువ సెంచరీలు చేసిన ఇండియన్ ప్లేయర్‌గా విరాట్‌ కొహ్లీ విరాట్‌ కొహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటిదాక సచిన్ తెందుల్కర్‌ 6 సెంచరీలు చేసిన రికార్డు ఉండగా.. దాన్ని తాజాగా కోహ్లీ బ్రేక్ చేశాడు. 

Also Read: షారుఖ్, సల్మాన్ కాదు.. భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ తెలుగు హీరోదే..? ఒక్క సినిమాకు 300 కోట్లు

Also Read: Big Boss 8: బిగ్ షాక్! నబీల్ ఎలిమినేటెడ్.. యష్మీ, పృథ్వీ డేంజర్ జోన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు