/rtv/media/media_files/2024/12/26/AqEMIbhTbPqekIEAwlvg.jpg)
Virat Kohli bumped into Sam Konstas
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ మధ్య నాలుగో (బాక్సింగ్ డే) టెస్టు అత్యంత రసవత్తరంగా జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా సామ్ కొన్‌స్టాస్ - ఖవాజా క్రీజులోకి దిగారు. 19 ఏళ్ల యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు.
ALSO READ: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్ స్వాప్ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు!
అయితే అరంగేట్రంతోనే కొన్‌స్టాస్ ఓపెనర్‌గా వచ్చాడు. వచ్చి రాగానే దుమ్ము దులిపేశాడు. భారత బౌలర్లకు చుక్కులు చూపించాడు. వేసిన ఎలాంటి బాల్‌ని అయినా తిప్పికొట్టాడు. అంతేకాదు బూమ్రా బౌలింగ్‌ని ఎదుర్కొవడమే కాకుండా ఊహించని షాట్లతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏ బ్యాటర్ అయినా బుమ్రా బౌలింగ్ అంటే కాస్త భయపడతారు. కానీ కొన్‌స్టాస్ మాత్రం బుమ్రా బౌలింగ్‌నే చితక్కొట్టాడు. స్కూప్, రివర్స్ షాట్లు అందరినీ మంత్రముగ్దులను చేశాయి.
ALSO READ: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూ లైన్‌కు స్వస్తి!
19 YEARS SAM KONSTAS SLANGING KOHLI🔥
— Hadia.K (@hadiyya_kleo) December 26, 2024
Things have reversed! #AUSvsIND #ViratKohli𓃵 #INDvAUS pic.twitter.com/umIP8XbQIU
ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?
కోహ్లీ - కొన్‌స్టాస్ మధ్య వాగ్వాదం
ఇది టెస్ట్ మ్యాచా లేక టీ20 మ్యాచా అన్నట్లు ఆడాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే అతడు దూకుడుగా ఆడుతున్న సమయంలో ఊహించని పరిణామం గ్రౌండ్‌లో చోటుచేసుకుంది. కొన్‌స్టాస్, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. ప్రతి ఓవర్ దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ కొన్‌స్టాస్‌ను కోహ్లీ ఢీకొట్టాడు.
36-year-old Virat Kohli sledged 19-year-old Sam Konstas. Then, in the very next over, he smashed 2 fours and 1 six.pic.twitter.com/2sCGiVCshm
— GBB Cricket (@gbb_cricket) December 26, 2024
ALSO READ: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి..ఎస్సై అదృశ్యం!
ఓవర్ కంప్లీట్ అయిన తర్వాత బాల్ తీసుకున్న క్రమంలో అతడిని కోహ్లీ తన భుజంతో ఢీకొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక అంపైర్ల జోక్యంతో వాగ్వాదం సర్దుమనిగింది. అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వాగ్వాదం తర్వాత కూడా కొన్‌స్టాస్‌లో ఎలాంటి మార్పు రాలేదు. అదే దూకుడు ప్రదర్శించాడు. చివరికి 65 బంతుల్లో 60 పరుగులు చేసి ఔటయ్యాడు.