virat Kohli : తుస్సుమనిపించిన కోహ్లీ... రంజీ ట్రోఫీలో కూడా అట్టర్ ప్లాప్!

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మళ్లీ నిరాశపరిచారు. రైల్వేస్ తో జరుగుతున్న రంజీ ట్రోఫీలో కోహ్లీ అట్టర్ ప్లాప్ అయ్యాడు.  తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైయ్యాడు. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి సంగ్వాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

New Update
 Delhi vs Railways

Delhi vs Railways

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మళ్లీ నిరాశపరిచారు.   అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్ తో జరుగుతున్న రంజీ ట్రోఫీలో కోహ్లీ అట్టర్ ప్లాప్ అయ్యాడు.  తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైయ్యాడు.  15 బంతులు ఎదురుకున్న కోహ్లీ..  కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి సంగ్వాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

స్టేడియం వదిలి వెళ్లిపోతున్న అభిమానులు

అంతకుముందు ఓ బౌండర్ బాదిన జోష్ లో కనిపించిన కోహ్లీ అ వెంటనే ఔట్ అయ్యాడు. దాదాపుగా 12ఏళ్ల తరువాత కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడుతున్న విషయం తెలుసుకున్న అభిమానులు అతని ఆటను చూసేందుకు వచ్చారు. ఇప్పుడు కోహ్లీ నిరాశపరచడంతో అభిమానులు స్టేడియం వదిలి వెళ్లిపోతున్నారు.

 రైల్వేస్‌ను 241 పరుగులకు ఆలౌట్ చేసిన ఢిల్లీ జట్టు 110 పరుగులకే 4  వికెట్లు కోల్పోయింది.  కెప్టెన్ ఆయుష్ బదోని (16), సుమిత్ మాథుర్ (13) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.  కాగా కోహ్లీ  చివరిగా 2012 నవంబర్ లో ఉత్తరప్రదేశ్‌తో ఘజియాబాద్‌లో జరిగిన రంజీ టోర్నమెంట్‌లో ఆడాడు.  ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. 

Also Read :  SSMB 29: ఎస్ఎస్ఎమ్బీలో ప్రియాంక చోప్రా..దీని వెనుక స్కెచ్ పెద్దదే..

Advertisment
తాజా కథనాలు