IND vs NZ : న్యూజిలాండ్‌తో మ్యాచ్.. విరాట్ కోహ్లీ అరుదైన ఫీట్!

టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ఇవాళ తన 300వ వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్ తో కోహ్లీ ఈ ఘనత అందుకోనున్నాడు. కోహ్లీ 299 వన్డేల్లో 93 స్ట్రైక్ రేట్‌తో 14 వేల 85 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలుండగా... 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

New Update
kohli 300 odi

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇవాళ తన 300వ వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్ తో కోహ్లీ ఈ ఘనత అందుకోనున్నాడు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, రాహుల్ ద్రవిడ్, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏడవ భారతీయ ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.కోహ్లీ 299 వన్డేల్లో 93 స్ట్రైక్ రేట్‌తో 14 వేల 85 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలుండగా... 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  అత్యధిక స్కోరు 193. 

సచిన్, సంగక్కర తర్వాత వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నారు. ఈ ఛేజ్ మాస్టర్ ఛేజింగ్‌లో 105 మ్యాచుల్లోనే 5 వేల 913 పరుగులు సాధించడం విశేషం. 2008 ఆగస్టు 18న అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన విరాట్..  వన్డే ఫార్మాట్‌లో అనేక మైలురాళ్లను సాధించాడు. 2023 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన అభిమాన ఆటగాడు సచిన్ రికార్డును 51 సెంచరీలను అధిగమించి, వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కూడా విరాట్ రికార్డు సృష్టించాడు.  

రోహిత్ శర్మకు విశ్రాంతి, గిల్ కెప్టెన్ 

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ మ్యాచులో కివీస్‌ను ఓడించి టేబుల్ టాపర్‌గా నిలవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్ కోసం జట్టులో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ ఆడటం అనుమానంగానే ఉంది. గిల్ కెప్టెన్ గా వ్యవహరించే ఛాన్స్ ఉంది.  మరోవైపు వరుస గెలుపులతో న్యూజిలాండ్ జోరు మీద ఉంది. ఈ మ్యాచులో గెలిచి రన్ రేట్ ఇంకా మెరుగుపరుచుకోవాలని ఆ జట్టు భావిస్తోంది.

Also Read :  దారుణ హత్య... సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త డెడ్ బాడీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు