Sekhar Kammula : స్టార్ హీరోయిన్తో శేఖర్ కమ్ముల పవర్ ఫుల్ మూవీ!

శేఖర్ కమ్ముల తదుపరి చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఓ లెడీ ఓరియంటెడ్‌ మూవీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ సమంత నటించనున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

New Update
samantha kammula

ఇటీవల కుబేర సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇందులో నాగార్జున, ధనుష్, రష్మిక కీలకపాత్రలు పోషించారు. దాదాపు వంద కోట్లు రాబట్టిన ఈ చిత్రం శేఖర్ కమ్ములకు మంచి పేరును తీసుకువచ్చింది. దీంతో శేఖర్ తదుపరి చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఓ లెడీ ఓరియంటెడ్‌ మూవీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ సమంత నటించనున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

Also Read :  Shubman Gill: కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన గిల్.. ఒకటి కాదు రెండుకాదు మొత్తం 5 రికార్డులు

నానితో  ఓ సినిమా

 గతంలో సమంత కూడా శేఖర్ కమ్ములతో మూవీ చేయాలని ఉందని సమంత  తెలిపింది. ఆయనతో సినిమా చేస్తే నటిగా హీరోయిన్లకు మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు సమంత. ఈ క్రమంలో వీరి కాంబోలో సినిమా రాబోతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది.  కుబేర తర్వాత శేఖర్ కమ్ముల నానితో  ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా జరిగాయి. 

Also read :  Sekhar Kammula : స్టార్ హీరోయిన్తో శేఖర్ కమ్ముల పవర్ ఫుల్ మూవీ!

ప్రస్తుతం నాని  ది ప్యారడైజ్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఎంత లేదన్నా రెండేళ్లు పట్టేలా ఉంది. అందుకే ఈ గ్యాప్ లో సమంతతో సినిమా చేయాలని శేఖర్  ప్లాన్ చేస్తున్నాడంట. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరిలోగా ఈ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.ఈ సినిమాలో శేఖ‌ర్ క‌మ్ముల స‌మంతను ఎంతో ప‌వ‌ర్‌ఫుల్ రోల్ లో చూపించ‌నున్నార‌ని స‌మాచారం. 

 శేఖర్ కమ్ముల సినిమాతో చాలామంది హీరోయిన్లకు మంచి పేర్లు వచ్చాయి. అనంద్, గోదావరి సినిమాలతో కమలిని ముఖర్జీ, ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలతో సాయిపల్లవిలకు ఇండస్ట్రీలో స్టా్ర్ హోదా సంపాదించుకున్నారు. 

Also Read :  విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టిన కెప్టెన్ గిల్

Advertisment
Advertisment
తాజా కథనాలు