Asia cup: అదరగొట్టిన కుర్రాళ్లు.. ఫైనల్లోకి యువ భారత్

అండర్-19 ఆసియా కప్‌ టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. తాజాగా జరిగిన మ్యాచ్‌తో ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ శ్రీలంకతో జరిగిన సెమీస్‌లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

New Update
U19 Asia Cup 2024

యువ భారత్ అదరగొడుతోంది. అండర్ 19 ఆసియా కప్‌ టోర్నీలో దుమ్ము దులిపేస్తుంది. మొదట ఓటమితో ప్రారంభించిన యువ భారత్.. ఇప్పుడు ఏకంగా సెమీ ఫైనల్‌లో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ అంటే శుక్రవారం శ్రీలంకతో జరిగిన సెమీస్‌లో టీమిండియా దూకుడు ప్రదర్శించింది. 7 వికెట్ల తేడాది ఊహించని విజయాన్ని కైవసం చేసుకుంది. 

Also Read: బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం.. వీడియో చూశారా!

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక 174 పరుగుల లక్ష్య ఛేదనతో టీమిండియా బరిలోకి దిగింది. 21.4 ఓవర్లలోనే టీమిండియా 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట వికెట్లు పడటంతో అందరూ కంగారు పడ్డారు. యువ భారత్ ఓడిపోతుందేమోనని అంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

Also Read: నిఖేశ్‌కుమార్‌ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!

దుమ్ము రేపిన వైభవ్

కానీ ఆ తర్వాత 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అందరికీ ఒక నమ్మకం కలిగించాడు. గ్రౌండ్‌లో చెలరేగిపోయాడు. ఓపెనింగ్‌లో దిగిన వైభవ్ సూర్యవంశీ - ఆయుష్ మాత్రే దుమ్ము దులిపేశారు. వైభవ్ 36 బంతుల్లో 67 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సులు) చేసి టీమిండియాను విజయం దిశగా తీసుకెళ్లాడు. అదే సమయంలో ఆయుష్ మాత్రే 28 బంతుల్లో 34 పరుగులు (7ఫోర్లు) చేశారు. 

Also Read: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం

దీంతో ఈ ఓపెనర్లు తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక వైభవ్ 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత సిద్ధార్థ్‌ 22 పరుగులు, మహ్మద్ అమన్ 25* పరుగులు, కార్తికేయ 11* పరుగులు చేశారు. దీంతో శ్రీలంక టార్గెట్‌ను పూర్తి చేసి యువ భారత్ ఫైనల్‌కు చేరుకుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు